-
-
కావ్య పరిమళం
Kavya Parimalam
Author: R. A. Padmanabha Rao
Publisher: Self Published on Kinige
Pages: 160Language: Telugu
నేను బి.ఏ.లో స్పెషల్ తెలుగు విద్యార్థిని. ఎం.ఏ.లో తెలుగు చదివాను. గత 60 సంవత్సరాలుగా తెలుగు సాహిత్య విద్యార్థిని. అనేక సందర్భాలలో ఆయా కావ్యాలపై ప్రసంగించాను. తెలుగు భాషలో వెలువడే అన్ని దిన పత్రికలలో మూడు వందల సాహిత్య వ్యాసాలు వ్రాశాను. అనేకమంది కవి పండితుల విమర్శ గ్రంథాలు ఆసక్తితో చదివాను. నన్నయ మొదలు ఆధునిక కవుల కావ్యాల పరిమళాలు ఆస్వాదించాను.
ఆంధ్ర సాహిత్య చరిత్ర పాఠ్యాంశంగా వివిధ సాహిత్య గ్రంథాలను అవలోకనం చేశాను. ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారి సాహిత్య చరిత్రను మా గురువు శ్రీ పోలూరి జానకీ రామశర్మ డిగ్రీలో మాకు పాఠంగా చెప్పగా, ఎం. ఏ. లో డా. జీరెడ్డి చెన్నారెడ్డి వివరంగా చెప్పారు.
సంచిక వెబ్ పత్రికను మిత్రులు కస్తూరి మురళీకృష్ణ మూడేళ్లుగా నడుపుతూ వారం వారం నాచేత వ్రాయిస్తున్నారు. మొదట ఆకాశవాణి పరిమళాలు, రెండో దఫా తిరుమలేశుని సన్నిధిలో, మూడవదిగా కావ్య పరిమళాన్ని ధారావాహికంగా ప్రచురించాను.
ఆంధ్ర సాహిత్య చరిత్రను లక్ష్మీకాంతంగారు పది యుగాలుగా విభజించారు. ఆయా యుగాల కాలాన్నిబట్టి ఈ గ్రంధంలో నేను కావ్యాలను వరుస క్రమంలో అమర్చాను.
- డా. ఆర్. అనంతపద్మనాభరావు
