• Kavitaa 62
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 62

    Kavitaa 62

    Publisher: Sahiti Mitrulu

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవ కళలు


వాళ్ళు
ఏదో సమయాన
ఎదురౌతారు
వెళ్ళిపోయిన వెన్నెల మళ్ళీ
కళ్ళలో ఉదయిస్తుంది
తప్పిపోయిన పాట మళ్ళీ
చెవుల్లో పల్లవిస్తుంది
ఎండిపోయిన పువ్వు మళ్ళీ
ముక్కుపుటాల్లో గుభాళిస్తుంది
రుచి దప్పిన పండు మళ్ళీ
జిహ్వ రేణువుల్లో పక్వ ఫలమౌతుంది
స్పర్శకి దూరమైన వానగాలి మళ్ళీ
చర్మ రంధ్రాల్లోకి చొరబడుతుంది
ఏమి చిత్రం
ఎంతటి విచిత్రం
పసిబిడ్డల ముఖ వీక్షణంలో
పునర్జన్మించిన పంచేంద్రియాలు
వాళ్ళు
జ్ఞానేంద్రియాల్ని లేవగొట్టే సూర్యోదయాలు
శిశువులు
పెద్ద తలల లోకంలో
జీవకళలున్న సజీవులు
వాళ్ళు
వచ్చిన సమయాన
మంత్రిస్తారు.

- రవి నన్నపనేని

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 62