• Kavitaa 55
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 55

    Kavitaa 55

    Publisher: Sahiti Mitrulu

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నడక



రాత్రి దుప్పటి కప్పుకున్న ఆకాశం
చీకటి వెలుగులో
దారిని వెతుక్కుంటోంది...
లోగొంతుకలో సెలయేటి పాట
అలలపై తేలుతూ..
కన్నీటి రాగమై తీతువుపిట్ట
లోక దుఃఖాన్ని తుడవాలని
తాపత్రయపడుతోంది...
బైరాగితత్వాన్ని ఎదురుచూస్తున్న రావిచెట్టు
ఆకుల గలగలల్ని
ఎదలో దాచుకుంది...
ఆకలిమింగిన రాత్రిని
చీకటితెరతో బంధిస్తూ
జీవితాన్ని శపిస్తోందో ముసలమ్మ...
రాత్రంటే వెలివేసినజీవితం
అంచులు దాటి ప్రవహించటం
అంతర్లోకాల్లోకి పయనించటం..
ఏకతారపై తేలివస్తూ
బైరాగి తత్వం
చెవికి సోకుతుంటే
దారి దొరికిన ఆకాశం
తాత్విక వెలుగులోకి నడుస్తోంది
చీకటి తెరని తొలగిస్తూ....

- సి.ఎస్. రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 55