• Kavitaa 51
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 51

    Kavitaa 51

    Publisher: Sahiti Mitrulu

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చివరి మనిషి



అలలు అలలుగా మాటలు
పోగవుతున్నాయి
కొన్ని గాలికి ఎగిరి కొట్టుకుపోతుంటే
కొన్ని ఒళ్లోంచి జారి మట్టిలో కలిసిపోతున్నాయి


జంతువుల అరుపులు,
పిల్లల కేరింతలు వట వృక్షాలై
పైకి ఎగబాకుతున్నాయి
అతను కొడవలి పుచ్చుకుని నరుక్కుంటూ నింగి
వరకు వెళ్లాడు


వర్షం వరదయ్యింది.
అతను తన లోపలి నుంచి మట్టిని
మనిషిని తోడి సముద్రాల్లోకి, అనంత
సాగారాల్లోకి పోశాడు


బీటలు పడిన ప్రపంచంలో
యుగాల కింద ఎవరో వేసిన ఓ ప్రశ్న
“ఎందుకీ పరుగు?”
తునకలై చెల్లా చెదురుగా పడి ఉంది...
కంప్యూటర్ కీ బోర్డ్ పై అతని చేతి వేళ్ళు
సమాధులై మొలిచాయి.

- రెహనా బేగం

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 51