-
-
కవితా! 48
Kavitaa 48
Author: Kavita Quarterly Magazine
Publisher: Sahiti Mitrulu
Pages: 32Language: Telugu
Description
శ్రీశ్రీ
తనకు తాను లోకం
ఎదురీత ఈదాలనుకుంటున్నాడు
తనకు తాను
రంపపుకోతకు అడ్డంగా నిలబడాలనుకుంటున్నాడు
..ఏముందో అమరత్వంలో !
చావులో జీవించడం చూసుకుంటున్నాడు మనిషి !
ఇన్ని ప్రభుత్వాల పాలకుల
సైంధి వీచకాలు వీచిన
మనిషి ఎందుకు ప్రశ్నవైపే ఉంటున్నాడు !
ప్రజలు.. ప్రజా... అని చెట్ల ఆకుల మీద...
పక్షుల రెక్కలమీద.... గాలితానై
ఎన్ని సంతకాలో మనిషివి !
కాలానికన్నా మనిషిదే అంతిమ విజయం
కవి అంటున్నాడు.
అమరంలో కూడా జీవించే మాట్లాడుతున్నాడు.
రెండు అక్షరాలు తెలుగునేల మీదనే కాదు...
యావత్ విశ్వం మీద మంత్రించి,
విత్తనాలుగా చల్లినాడు.
వాడు మరణంలో కూడా జీవిస్తున్న
నేటి మహాకవి
శ్రీశ్రీ.
- జనజ్వాల
Preview download free pdf of this Telugu book is available at Kavitaa 48
Login to add a comment
Subscribe to latest comments
