-
-
కవితా! 47
Kavitaa 47
Author: Kavita Quarterly Magazine
Publisher: Sahiti Mitrulu
Pages: 32Language: Telugu
Description
మనస్సు
జీవిత పట్టెడ మీద
ఇనుప ముక్క మనసు
పాపం.. ఎన్నెన్ని సమ్మెట దెబ్బలో దానికి !
కమ్మని మాటల పోటుకు కరిగి, మెత్తబడి
ఆనందపు మెలికలు
వంపులు తిరుగుతూ సాగుతూ
భావావేశంతో కందగడ్డవుతుంది.
ఎంతటి స్థితి స్థాపకతో దానికి
పదాల వ్యాప్తి అవ్యాప్తిలా
ఆ సమ్మెట స్వర తీవ్రత
వాడి, వేగం
దాని సంకోచ, వ్యాకోచాల నిర్దేతలు !
పరవశం, గుంజాటన
గునియడం నటన, మొరాయింపులు
దానికి తెలియని విద్యలలో కొన్ని మాత్రమే !
పొగలి పొగలి పొంగడం
పొగిలి, పొగిలి ఏడవటం
దానికి కూసు విద్యే !
జీవన గమనపు
ఎత్తుపల్లాల ఒజ్జలు చూపిన స్థైర్యంతో
రాగద్వేషాల కతీతమవుతుంది.
- బొడ్డపాటి చంద్రశేఖర్
Preview download free pdf of this Telugu book is available at Kavitaa 47
Login to add a comment
Subscribe to latest comments
