• Kavitaa 44
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 44

    Kavitaa 44

    Publisher: Sahiti Mitrulu

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చదువలేదు


ఆ అక్షరాలన్నీ ఆదుర్దాగా తడిమి
అందులో నిన్ను వెతుక్కున్నా
విషవాయువులు పీల్చుకున్నట్టు
గుండె తెగి దూరంగా పడిపోయింది
అచేతనంగా చల్లబడుతున్న రక్తంపై
ఆసిడ్ లా అశ్రువులు
అప్పుడంతా ఆగిపోయింది
మద్యలో లీలగా అక్షరాలు ఏమీ మిగలలేనిచోట
అపురూపంగా కన్నీళ్లు గొంతుమీదకు చేరుకొని
ముడి బిగిస్తున్న జ్ఞాపకాలు
అప్పుడప్పుడూ గాలి వీచి
బతికున్నానని గుర్తుచేస్తుంది
చీకటైతే ఉంది కానీ
ప్రాణం గురించి నాకేం తెలుసు
నిర్జీవ క్షణాల్లో ముఖాన్ని దాచేసాయి చేతులు
దుఃఖంలో తడిపిన అక్షరాల్ని
ఈసారి కొత్తగా చూసా
అప్పుడర్థమైంది
నువ్ రాసింది నేనింకా చదవలేదని...

- స్వేచ్ఛ వోటార్కర్

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 44