• Kavitaa 29
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కవితా! 29

    Kavitaa 29

    Publisher: Sahiti Mitrulu

    Pages: 40
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుసు నీకు


నీకు ముందే తెలుసు కదా...!
నువ్వెవరికీ చెందవనీ నువ్వొక్కడిగానే నడవాలనీ,
తీరాల ఇసుకలో ఒంటరి పాదముద్రలని
వదిలి పోయే వాడివీ అని..
నీకెప్పుడో తెలుసు కదా నువ్వొక అవాంఛిత
ఊహవనీ
పగుళ్ళ కాళ్ళతో నువ్వు సముద్రాలని
నడిచినపుడూ
కూలిన గోడ పై వర్షపు నీటిలా నువ్వు
జారినపుడూ
ఎక్కడా శబ్దపు జాడలు లేక నువ్వు
తల్లడిల్లినప్పుడూ
కొన్ని గుప్పిళ్ళ బియ్యపు గింజలు చేతిలో
పట్టుకొని
పంచుకోవటానికి ఎవ్వరైనా వస్తే బాగుండుననీ
నువ్వు కోరుకున్నప్పుడు కూడా
నీకు తెలుసు
నువ్వొక విరిగిన నక్షత్ర చేప దేహానివనీ
ఎప్పటికీ నిన్నెవరూ స్పృశించరనీ

- నరేష్కుమార్

Preview download free pdf of this Telugu book is available at Kavitaa 29