-
-
కవితా సత్యదర్పణం
Kavita Satya Darpanam
Author: Aduri Venkata Seetarama Murty
Pages: 88Language: Telugu
సత్యవతీదేవి కవితల్లో Meditative poetry చాలా ప్రధానంగా ఉన్నది. జీవనాలోకాన్నీ బాహలోకాన్నీ వేరుగా చూడకుండా ఆత్మసౌందర్యంతో బాహ్య జగత్తునీ ఆకళించుకునే అనుభూతినే కవితలుగా వెలువరిస్తున్నారు.
- ఆర్.ఎస్. సుదర్శనం
సత్యవతీదేవిగారివి Contemplative / reflective lyrics. ఉదారంగా నీరు ఎండిపోయిన భూమిమీద ప్రవహించినట్లు యీ కవితలు. 'దిగులుగుబులై పోయిన ఒంటరివేళలుంటేనేం ఎల్లలెరుగని మహాచైతన్యం నీ వెంటవుండగా' అన్న robust optimismతో తన వాక్యాలకి ప్రాణమిచ్చి సారాంశపు రహస్యాన్ని తలుపులు తలుపులుగా తెరుస్తారు సత్యవతీదేవి వీరి కవితల్లో.
- త్రిపుర
ఆదూరి సత్యవతీదేవి గారు తన అక్షరాలపై స్వప్నధూళి చల్లుతారు. మనుషులెట్లా వుండాలి? మానవ సంబంధాలెలా వుండాలి? అన్నవాటి గురించి ఆమె ఊహలు కాల్పనిక మాధుర్యంతో ఉదాత్తంగా వుంటాయి.
- సౌభాగ్య
.. ఏది పలికినా అనుభూతి స్పర్శతో పాటు ఆలోచనాముద్ర వుండడం వీరి కవితల్లో చూశాను.
- డా. సి.నారాయణరెడ్డి
... ఏ సంఘటనను స్పృశించినా అద్భుతమైన భావనాపరంపర జలపాతంలా ఎగసి పడుతుంది. వస్తువైవిధ్యాన్ని పాటిస్తూనే రూపవైశారద్యాన్ని సాధించారు కవయిత్రి...
- నాయని కృష్ణకుమారి

- ₹60
- ₹97.2
- ₹81
- ₹106.8
- ₹81
- ₹131.76