-
-
కవిత వ్రాసిన కమ్మవారు-2
Kavita Rasina Kammavaru 2
Author: Dr. Suryadevara Ravikumar
Publisher: Self Published on Kinige
Pages: 229Language: Telugu
1983 ప్రాంతంలో విజయవాడ నుండి 'కమ్మవెలుగు' పత్రిక వెలువడుతున్నప్పుడు ఆ పత్రిక కోసం ప్రాచీనులైన కావ్య కృతిపతులైన కొందరు కమ్మవారిని గురించి వ్రాయటం జరిగింది. ఆ తరువాత 'కమ్మమిత్ర' పత్రిక కోసమూ ఈ కృషి కొనసాగింది. 1990 లో కమ్మ కుల పత్రికగా 'దీప్తి' ని నిర్వహిస్తున్నప్పుడు కమ్మ కవులను గూర్చి వ్రాయటం ప్రారంభించాను. పై పత్రికలు మఖలో పుట్టి పుబ్బలో కనుమరుగయ్యాయి. అయినా నా కృషి అప్పటి కొల్లూరు, భట్టిప్రోలు గ్రంథాలయాధికారులు శ్రీ కొడలి గోపాలరావు, శ్రీ సుఖవాసి గోవర్ధనరావు గారల ప్రోత్సాహంతో నత్తనడకనైనా కొనసాగింది. దాని ఫలితంగానే తుమ్మల సీతారామమూర్తి గారి రచనలపై సమగ్ర పరిశీలనతో 7 వ్యాసాలు రచించటం అవి వారి కుమారుని ఆదరణతో 'అజరామర వాఙ్మయమూర్తి-తుమ్మల సీతారామమూర్తి' అన్న గ్రంథంగా వెలువడటం జరిగింది.
ఈ సమయంలోనే శ్రీ వెలగా వెంకటప్పయ్య గారి ప్రోత్సాహంతో కమ్మ కవుల వివరాలను కొంత సేకరించటం జరిగింది. దాని ఫలితంగా 'తెలుగు కవితారంగంలో కమ్మవారు' అన్న పెద్ద వ్యాసాన్ని రచించటం, అది 'కమ్మవెలుగు' పత్రికలో ధారావాహికగా రావటం జరిగింది. అయితే అది సమగ్రంగా లేకపోవటంతో దానికి సమగ్రతను కలిగించాలనే సంకల్పంతో 2004వ సంవత్సరం నుండి ఈ కృషి మళ్ళీ కొనసాగింది. ఇందుకు గుంటూరులోని పుస్తక ప్రేమికులు, వేలాది గ్రంథాల సేకర్త మాన్యశ్రీ లంకా సూర్యనారాయణ గారు పూర్ణ సహకారాన్ని అందించారు. పుస్తక సేకరణ విషయమై వారిది తీరని తపన. వారివద్ద నేను ఊరూ పేరూ ఎరుగని ఎందరో కమ్మ కవుల గ్రంథాలు లభించాయి. ఇదే సమయంలో శ్రీ నాగభైరవ కోటేశ్వరరావు గారి ప్రోత్సాహమూ లభించింది. గుంటూరులోని జిల్లా గ్రంథాలయ సంస్థలోను, ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలోను మరికొంత సమాచారం లభించింది. అయితే ఎందరో కవుల విషయంలో సమగ్ర సమాచారం లభించలేదు. సుమారు 40, 50 సంవత్సరాల క్రితం గతించిన కవులను గూర్చి వారి జన్మస్థలాలలో విచారించినా వారి వ్యక్తిగత సమాచారం గాని, అలభ్య గ్రంథాలు గాని లభించనేలేదు. దురదృష్టవశాత్తు ఆయా కమ్మ కవుల వారసులకు కవితాభిమానం లేకపోవటం, ఇప్పటి వారి కుటుంబ సభ్యుల చిరునామాలు లభించకపోవటం, లభించిన సందర్భాలలో కూడ వారు వారి తాత/తండ్రుల గూర్చి, వారి గ్రంథాలను గూర్చి చెప్పలేకపోవటంతో కొందరి విషయంలో అసంపూర్తి సమాచారాన్నే ఇవ్వవలసి వచ్చింది.
ఆంధ్ర సాహితీలోకం, ముఖ్యంగా సాహిత్య పరిశోధకులు ఈ గ్రంథాన్ని సమాదరిస్తారని విశ్వసిస్తున్నాను. క్రీ.శ. 1911 నుండి క్రీ.శ. 1930 వరకు జన్మించి కవిపోషకులైన, కవిత వ్రాసిన కమ్మవారిని గురించినదీ రెండవ సంపుటము.
- సూర్యదేవర రవికుమార్
