-
-
కవిత 2009
Kavita 2009
Author: Sahiti Mitrulu
Publisher: Sahiti Mitrulu
Pages: 176Language: Telugu
ప్రతీ ఏడాది, ఆ సంవత్సరం ప్రచురితమైన కవితల్లోంచి అత్యుత్తమ కవితలని ఎంచుకుని ఒక సంకలనంగా ప్రచురిస్తున్నారు సాహితీమిత్రులు. కాలానుకనుగుణంగా కవితలను పరిణామాల్లో అంశాలకు ఆవిర్భావ వికాసాలకు ఇవి దర్పణాలు. సంపాదకులు పాపినేని, దర్భశయనం వారి ప్రమాణాల మేరకు కవితల్ని ఎన్నిక జేయడం జరుగుతుంది.
ఈ పుస్తకం 2009లో ప్రచురితమైన కవితల్లోంచి ఏరిన 83 కవితలతో కూడిన సంకలనం. ఉత్తమ కవితలను ఒకేచోట ఆస్వాదించేందుకు ఈ పుస్తకం చదవాలి.
* * *
సంపాదక వాక్యం లోంచి కొన్ని మాటలు....
ఈ సంకలనం కోసం కవితల్ని స్వీకరించేడప్పుడు ప్రధానంగా క్రితం సంవత్సరంలో వచ్చిన పరిణామాల్నీ, చోటు చేసుకున్న ఘటనలని చ్రిత్రించిన కవితల్ని పరిశీలించి, కొన్ని ప్రాతినిధ్య కవితల్ని ఎంచుకున్నాం. స్థానికతను కేంద్రబిందువుగా చేసుకుని వచ్చిన వివిధ కవితల్ని పరిగణనలోకి తీసుకుని, కొన్నింటిని ఈ సంకలనంలో చేర్చాం. ఇవి కాక దైనందిన జీవనానుభవాన్నీ, తాత్వికతనూ, అనుభూతుల్ని ఆవిష్కరించిన కవితల్ని స్వీకరించడం ద్వారా వస్తుపరంగా వైవిధ్యాన్ని ప్రతిబించించే ప్రయత్నం చేశాం. రూపపరంగా ప్రత్యేకతను సంతరించుకున్నకొన్ని కవితల్ని చేర్చడం కూడా ఒక బాధ్యతగానే భావించాం. 'నెట్' పత్రికలలోంచి కొన్ని కవితల్ని స్వీకరించి దూరప్రాంతాల తెలుగు కవుల మనోభావాల్ని, జీవన దృష్టికోణాన్ని అందరి దృష్టికి తీసుకురావాలని మా అభిప్రాయం. అలా కొన్ని కవితలు దీనిలో చేరాయి.
భిన్న స్వరాల భిన్న వస్తువుల భిన్నరీతుల ఆవిష్కరణల సమాహారం ఈ సంకలనం. ఈ స్వరప్రపంచంలోకి మీకిదే మ ఆహ్వానం.
ధర్భశయనం శ్రీనివాసాచార్య
హైదరాబాద్, 20-4-2010
