-
-
కవిత 2007
Kavita 2007
Author: Sahiti Mitrulu
Publisher: Sahiti Mitrulu
Pages: 197Language: Telugu
Description
ప్రతీ ఏడాది, ఆ సంవత్సరం ప్రచురితమైన కవితల్లోంచి అత్యుత్తమ కవితలని ఎంచుకుని ఒక సంకలనంగా ప్రచురిస్తున్నారు సాహితీమిత్రులు. కాలానుకనుగుణంగా కవితలను పరిణామాల్లో అంశాలకు ఆవిర్భావ వికాసాలకు ఇవి దర్పణాలు. సంపాదకులు పాపినేని, దర్భశయనం వారి ప్రమాణాల మేరకు కవితల్ని ఎన్నిక జేయడం జరుగుతుంది.
ఈ పుస్తకం 2007లో ప్రచురితమైన కవితల్లోంచి ఏరిన 97 కవితలలో కూడిన సంకలనం. ఉత్తమ కవితలను ఒకేచోట ఆస్వాదించేందుకు ఈ పుస్తకం చదవాలి.
చివరి అట్ట మీది కవిత మీ కోసం
* * *
నాకు తెలుసు
నాకు తెలుసు
నాకు ఖననముండదని
చావుని బతుకుతో
సమానం చేసేవాడిని
సమాధి చేయడం చాలా కష్టం
దానిలో మార్గం ఏర్పరిచినపుడు
చావులోనూ
బతుకులోనూ బతికే వాణ్ణి
సమాధి చేయడం మరీకష్టం
నాకు తెలుసు
నాకు ఖననముండదని
బల్గేరియన్ మూలం: దానిలాస్టోయిలోవా
తెలుగు అనువాదం: కె. శివారెడ్డి
Preview download free pdf of this Telugu book is available at Kavita 2007
Login to add a comment
Subscribe to latest comments

Offers available on this Book