• Kavisena Manifesto Adhunika Kavyasastram
  • fb
  • Share on Google+
  • Pin it!
 • కవిసేన మేనిఫెస్టో ఆధునిక కావ్యశాస్త్రమ్

  Kavisena Manifesto Adhunika Kavyasastram

  Pages: 264
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

కవిసేన మేనిఫెస్టో

ఆధునిక కావ్యశాస్త్రమ్


ఏ విషయం మీదనైనా రాయండి. కానీ ఆ రాసింది కవిత్వం అన్నది ప్రమాణీకరించుకోండి అంటున్న ఈ పుస్తకంలో స్పష్టంగా కనపడేది శాస్త్రవిధేయత. తను అంటున్న ప్రతిదానికి ప్రమాణకంగా గొప్ప గ్రంథాన్నో విమర్శకుల పలుకులనో శాస్త్రజ్ఞుల సిద్ధాంతాలనో చూపిస్తూ ఉండటం ఈ కవి ప్రత్యేకత. కేవలం చెప్పటమే కాక, పూర్వాపరాలు స్పష్టంగా చిత్రీకరిస్తూ తన సిద్ధాంతాలకు భాష్యం చెప్పుకు పోవడం ఈ కవి గొప్పతనం.

అసలు ప్రక్రియే దేనికైనా ప్రాణమని ఆకర్షించడానికి ప్రక్రియను అసరాగా చేసుకొని, సార్వజనీన శ్రేయస్సు అనే ప్రయోజనాన్ని పొందాలి అనేదే ఈ కవి ద్వారా కవిసేన చేస్తున్న ఉపదేశం...... సమగ్ర మానవ జీవితంలో ఒక భాగమైన రాజకీయాలకు లొంగిపోయి, కవిత్వం మరచిపోయి, నినాదాల్ని ఎడాపెడా కవిత్వం పేరుతో చలామణీ చేస్తున్న కవికి - కొరడా దెబ్బలీ పుస్తకంలో హితవులు.

.... దేశానికి నాయకత్వం వహించాల్సిన కవి, రాజకీయ భవనాల్లో పెంపుడు కుక్కగా బ్రతకడాన్ని నిరసిస్తూ తనకున్న ఆయుధాలను గమనించి, వాటికున్న చైతన్యాన్ని గుర్తించి సరిగ్గా ప్రయోగించి వైజ్ఞానిక నాయకత్వాన్ని దేశానికి ప్రసాదించాల్సిన బాధ్యత కవికి ఉందని చెప్పే మేనిఫెస్టో ఇది.

- ఈనాడు దినపత్రిక, 5-11-1978

ఈ 'ఆధునిక కావ్యశాస్త్రమ్'లో కొన్ని విలువైన తలంపులున్నాయి. వాటిని పొందగోరిన వారు తేనెతుట్టెలో తేనెటీగల్ని తోలి తేనెను తీసుకున్నట్లుగా శ్రమపడి తీసుకోవాలి.

కవితాశిల్పమెలా ఉండాలో ఈ కావ్యశాస్త్రంలో "కవిత్వం శబ్ద శిల్పమా?” అనే ప్రకరణంలో విపులంగా చర్చించారు..... శిల్పంలేని రచన ఎంత పేలవమో వివరిస్తూ అర్థదోషాలు పద్దెనిమిదింటిలో నిరలంకృతి అనే ఒక దోషాన్ని చెప్పడం గురించి ఆలోచనాత్మకమైన చర్చ చేశారు....

ఈ పుస్తకంలో ప్రాక్పశ్చిమ భేదం లేకుండా విశ్వవ్యాప్తులైన కవుల రసవత్ కావ్య ఖండికలను, కవితా సిద్ధాంతాలను చర్చించడం ఆసక్తిదాయకంగా కనిపిస్తుంది....

సహృదయులీ గ్రంథం చదవకపోతే తెలుగు సాహిత్యానికి సంబంధించిన చాలా విలువైన విషయాలను తెలుసుకోకపోవటమవుతుందని మాత్రం చెప్పగలను.

- ఆంధ్రప్రభ దినపత్రిక, 1-10-1978

దాదాపు 40 ఏళ్ల క్రితం మొదటిసారి అచ్చయినపుడు చాలా చర్చను రేకెత్తించిన పుస్తకం ఇది. ఆ చర్చ సంగతెలా ఉన్నా కవిత్వాన్ని ప్రేమించే వాళ్లకు, అకవిత్వాన్ని తిట్టుకునే వాళ్లకు పనికొచ్చే కొటేషన్లు ఇందులో అనేకం ఉన్నాయి. మచ్చుకి ఒకటి - 'ప్రతి కవితా ఎలా ఉండాలి? జయదేవుడు చెప్పిన ఉష్ణోగ్రత కలిగి ఉండాలి. ఒక మారణాస్త్రంలా ఉండాలి. పట్టుకుంటే చస్తామేమో అనే భయం కలిగించాలి. చదివి పాఠకుడు చావాలి. కొత్త జన్మ ఎత్తాలి, అది పరమార్థం' - కవిత్వం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో సుదీర్ఘంగా చర్చిస్తూ అనేక ప్రామాణిక గ్రంథాలను, కవులను ఉటంకిస్తూ శేషేంద్ర శర్మ చేసిన బృహత్ రచన ఇది.

- ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఆదివారం ఆంధ్రజ్యోతి, 6 మార్చి 2016

* * *

ఒక కవి రాశిన ఆధునిక కావ్యశాస్త్ర్రం -
తెలుగుదేశంలో నూతనంగా కవిత్వభోధ అభివ్యాప్తం చెయ్యడానికి ప్రయత్నించే గ్రంథం-

అపూర్వ చైతన్య వ్యాప్తి కోసం ఐతిహాసిక పరిస్థితుల్లో ఆవిర్భవించిన ఒక ఉద్యమపత్రం.

సామాన్య శబ్దానికి అసమాన్య ఆకర్షణ శక్తి ప్రదానం చేసి, దాన్ని మహత్తర పురోగమన సాధనంగా మార్చే అయస్కాంత విద్యను యువతరానికి నేర్పడానికి సాహిత్య సత్యాగ్రహయోద్ధల్ని మలచడానికి శబ్దరూపమెత్తిన కృషి-

ప్రాచీన ప్రాక్ పశ్ఛిమ కావ్యతత్త్వ చింతన, ఆధునిక కావ్యతత్త్వ చింతన, మార్క్సిస్టు కావ్యతత్త్వ చింతనా అనే చింతనా చతుష్టయ శాఖల్ని కలిపి పరిశీలించి ఆ నాల్గింటిలో ఉన్న ఆశ్చర్య జనక అభిన్నతనూ ఐకమత్యాన్ని ప్రతిపాదించి, ఈ విజ్ఞాన భారాన్నంతటినీ మోస్తేనే ఆధునిక మానవుడి విజ్ఞానానికి సమగ్రత వస్తుందని ప్రతిపాదిస్తుంది.

శోకము ప్రీతి సత్త్వము సమాధి ఆది శబ్దాలకున్న అలంకారిక ప్రతిపత్తి -ప్రతిభ జన్మసంస్కారం కాదు, సమాధిగానీ విలక్షణ వ్యుత్పత్తిగానీ సాధించగల శక్తి అనే అలంకారిక మతము- కవే ప్రాచీన మత వాజ్ఞ్మయ కర్త- వాల్మీకి ప్రధమ ప్రజాకవి- వాల్మీకి ఉపమలు ప్రతీకలే-కవి శోకజ్వాలే కవిత్వంలో కమిట్మెంట్ ఇత్యాది నూతన విశేషాలు ఆవిష్కరిస్తుంది.

* * *

శేషేంద్ర సాహిత్య జగత్తును జీవిత విశేషాలను ఈ కింది హోం పేజి లో దర్శించండి.

Seshendra : Visionary poet of the Millennium

http://seshendrasharma.weebly.com

-----


*కవిత్వం బతుకు తెరువు కాదు.... జీవన విధానం
*వచనంలో ఏది చెప్పాడనే దానికి స్దానమున్నట్లే కవిత్వంలో ఎట్లా చెప్పాడనే దానికే ప్రధాన
స్థానం ఉంటుంది. *ఈనాడు కావలసింది సామాజిక చైతన్యం కాదు. సాహిత్య చైతన్యం
*వర్తమాన తెలుగు మహా కవులు కవిత్వపు కల్తీ లేని స్వచ్చమయిన వచనమే రాస్తున్నారు.
*ప్రతి కవితా ఎలా ఉండాలి ?... .. చదివి పాఠకుడు చావాలి. కొత్త జన్మ ఎత్తాలి.
*కవి నడుస్తున్న మానవతా సంక్షిప్త శబ్ద చిత్రం.

- శేషేంద్ర

* * *

1977లో వచ్చిన ఈ కావ్య శాస్త్రం, అప్పట్లో సాహిత్యంలో అన్ని వర్గాలనూ, అన్ని సంఘాలనూ తీవ్రమయిన ఆందోళనకు, మనస్తాపానికి గురి చేసింది. నిజం అంత ప్రమాదకరమయింది. నేటికీ తెలుగు కవిత్వంలో అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరింత తీవ్ర రూపం దాల్చాయని చెప్పవచ్చు. కనుకనే కవిసేన కావ్య శాస్త్రం అన్నికాలాలకూ వర్తిస్తుంది.

* * *

ఇది 'కవిసేన మేనిఫెస్టో ఆధునిక కావ్యశాస్త్రమ్ 4th రివైజ్డ్ ఎడిషన్'

1977 నుంచి ఈనాటి వరకు వచ్చిన సమీక్షలు, వ్యాసాలు అన్నీ ఇందులో ఉన్నాయి.

Preview download free pdf of this Telugu book is available at Kavisena Manifesto Adhunika Kavyasastram