• Kaviraju Tripuraneni
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • 'కవిరాజు' త్రిపురనేని

    Kaviraju Tripuraneni

    Publisher: Vignana Vedika

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవి, నాటక కర్త, భావుకుడు, భావ విప్లవకారుడు, హేతువాది, సంస్కర్త, నాస్తికాగ్రణి, ఆర్ష సాహిత్యాబ్ధిని అలవోకగా అపోసనపట్టిన అగస్త్యుడు, పురాణేతిహాసాల లోగుట్టును రట్టుచేసి, దురాచారాల్ని తునుమాడిన క్రాంతదర్శి, సంఘ సంస్కరణే ధ్యేయంగా ప్రత్యామ్నాయ సాహితీ సృజన చేసిన అపర కౌశికుడు, బారిష్టరు, శతావధాని, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారి బహుముఖీనమైన కృషికి ఇలా ఈ చిన్న పుస్తకం ద్వారా నివాళులర్పించబూనడం నిజంగా నాబోటి సామాన్యుడికి సాహసమే. అయినా వారి పట్ల నాకున్న అపరిమితమైన అభిమానమే నన్నీ సాహసానికి పురికొల్పింది.

* * *

రామస్వామిగారు ఆశావాది. సమాజంలో అంతటా మంచి వికసించాలనీ, మానవులందరికోనూ సానుకూల దృక్పథం వెల్లివిరియాలనీ ఆయన తపన. అదే లక్ష్యంతో అయన కడవరకూ నియమబద్ధమైన కృషి చేశారు. వారి ఈ సదాశయం నెరవేరి, అందరికీ ఆ మంచికాలం అతి త్వరలో రావాలని ఆశిద్దాం.

- ముత్తేవి రవీంద్రనాథ్

Preview download free pdf of this Telugu book is available at Kaviraju Tripuraneni