-
-
కత్తి అంచు పై...
Kathi Anchu Pai
Author: Dr. Lanka Siva Rama Prasad
Publisher: Dr. Lanka Siva Rama Prasad
Pages: 208Language: Telugu
'Noir' అనే ఫ్రెంచి పదానికి అర్థం - Black..
1940 తొలినాళ్లలో యూరప్‌లో ఆర్ధిక, రాజకీయ సంక్షోభం, అమెరికాలో Prohibition విధించినప్పటి వాతావరణంలో దిగజారిన నైతిక విలువలు, ఆర్థిక పరిస్థితులను అప్పటి ప్రముఖ రచయితలు తమ కథల్లో కళ్లకు కట్టినట్లు వర్ణించారు. ఈ కథలు 'Noir' కథలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అదే సమయంలో హాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఆస్ట్రో జర్మన్ సినిమా నిర్మాతలు 'Film Noir'కు ఆద్యులయ్యారు. Sex, Violence, Crime నేపథ్యంగా ఉండే ఈ కథలు, చిత్రాలలో 'పెంజీకటికావల వెలుతురు' కనిపించదు. అందరూ గాయపడ్డవాళ్లే! It is a lose - lose situation. వీటినే 'Noir genre' గా పేర్కొంటున్నారు.
2010-2011 సంవత్సరాలలో నేను ముంబాయిలో ఉన్నప్పుడు గమనించిన కొన్ని వాస్తవిక సంఘటనలను కథలుగా మలిచాను. ప్రతి కథ ఒక ప్రత్యేక శైలిలో ఉండేట్లు ప్రయత్నించినా కొన్నిటిలో వ్యాసధోరణి ఉన్నదనేది వాస్తవం. ఈ కథలకు ముంబాయి, వరంగల్, కరీంనగర్ పరిసర ప్రాంతాలు నేపథ్యంగా ఉన్నా సంఘటనలు అన్నిచోట్లా, ప్రతిరోజూ సంభవిస్తున్నవే! అనేక మంది ప్రసిద్ధ రచయితలు తమ దృక్కోణంలో వర్ణించినవే!
అందరం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, కరెంటు ఇంకా రాని ఆ ఊళ్లో ఆరుబయట మంచంపై పడుకొని ఆకాశంలోని చుక్కల్ని లెక్కబెడుతూ కదిలే మబ్బుల్ని, ఎగిరే పక్షుల్ని చూస్తూ మేమందరం మా తాతయ్య చెప్పే కథలు వింటుంటే కాలం ఎంత హాయిగా గడిచేదో! కథలు అవే! సంఘటనలూ అవే! కథకులు మార్తారు! కథను చెప్పే విధానం మారవచ్చు. ఈ కథలూ అంతే!
తెలుగు కథల్లో ఇలా 'Noir' సంవిధానంలో వస్తున్న మొదటి కథల సంపుటి ఇదే కావచ్చును. తెలుగు పాఠకులకు 'సృజనలోకం' సవినయంగా సమర్పిస్తున్న ఇరవై ఆరవ కానుక ఈ - 'కత్తి అంచు పై...' (Some Urban Noir Stories) కథల సంపుటి.
- లంకా శివరామప్రసాద్

- ₹540
- ₹324
- ₹270
- ₹324
- ₹270
- ₹216
- ₹540
- ₹324
- ₹270
- ₹324
- ₹270
- ₹216