-
-
కథాసుధ - 1
Kathasudha 1
Author: Dr. Duggirala Raja Kishor
Publisher: Sikshana Mandal Prakashan
Pages: 64Language: Telugu
శిశువులకు, బాలురకు మనస్సు భావప్రధానంగా ఉంటుంది. సంస్కారాలను గ్రహించేదిగా ఉంటుంది. ఇది ప్రపంచమంతటా అంగీకరింపబడిన విషయం. శిశువులకు గాని, బాలురకు గాని 3-14 ఏండ్ల ప్రాయంలో ఏయే విషయాలు మనస్సులో చోటుచేసుకుంటాయో అవే వారి స్వభావాన్ని తీర్చిదిద్దడానికి పునాది రాళ్ళవుతాయి. ఇందువల్లనే అన్ని కాలాల్లో, అగ్ని దేశాలలో సౌశీల్య నిర్మాణ ప్రక్రియకు అత్యంత శ్రద్ద వహించబడుతోంది. ఈ దిశలో కథాసాహిత్యానికి అన్నింటి కంటే ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. కథల ద్వారా పిల్లలకు ఆచరణాత్మక మార్గదర్శనం లభిస్తుంది.
- మాన్యశ్రీ కుప్పిహళ్ళి సీతారామయ్య సుదర్శన్
కథలంటే పిల్లలు చెవి కోసుకుంటారు. ఎందుకు? కథలలో తమలో గల లేదా తమకు నచ్చిన గుణగణాలు గల పాత్రలు వారికి తారసిల్లుతాయి కనుక. ఆ పాత్రలు జంతువులు, పక్షులు కావచ్చు, సాహసాలు చేసే రాజకుమారుడు కావచ్చు, లేదా మహాత్యాగమూర్తులయిన శిబి, దధీచి వంటివారు కావచ్చు. క్లిష్ట సమయాలలో ఎలా ప్రవర్తించాలో, ఎలా బ్రతకాలో లేదా అసలెందుకు బ్రతకాలో ఆ పాత్రలు మాట్లాడకుండానే చెప్తాయి. ఆ విధంగా వింటున్న పిల్లవానికి కథ జీవిత దర్పణంలా ఉంటుంది.
- డా. వడ్డి విజయసారథి
