-
-
కథాసుధ
Kathasudha
Author: Pebbili Hymavathi
Publisher: S.R. Book Links
Pages: 252Language: Telugu
ఇవి నానమ్మ చెప్పిన కమ్మని నీతి కథలు. ఈ పుస్తకం చదువుతూవుంటే భేతాళ కథలు, అరేబియన్ నైట్స్ కథలు, అక్బర్ బీర్బల్ కథలు, తెనాలి రామలింగడి కథలు, కాశీమజిలీ కథలు - ఇలాంటివన్నీ గుర్తుకువస్తాయి. ఎందుకంటే వాటి ఛాయలు ఈ కథల్లో పుష్కలంగావున్నాయి. అయితే, ఈ కథలన్నీ పాత కొత్తల మేలుకలయిక! అవి క్రొమ్మెరుంగులు చిమ్మేయి ! అలనాటి జానపదకథలు బోధించే ధర్మాన్నీ, నీతినీ మరింత సులువుగా పెద్దలకూ, పిల్లలకూ అందజేసేరీతిలో రచయిత్రి ఆ కథలను కొత్తగా మలచిన తీరు అభినందనీయం. పాత కథలకు కొత్త నగిషీలు చెక్కి కథనడిపిన తీరులో ముడి విూద ముడి వేస్తూ కథలు చెప్పిన చాతుర్యం ఈ పుస్తకంలో మనకు అద్భుతంగా గోచరిస్తుంది.
ఒక కుటుంబంలోని నానమ్మ మనవలకీ, మనవరాళ్ళకీ నీతి సూత్రాలు చెబుతూ, సమష్టి కుటుంబంగా బ్రతకటంలోని మాధుర్యాన్ని వాళ్లకి తెలియజేస్తూ ఉంటుంది.
ఆ బంధుత్వాలను నిలబెట్టుకోవలసిన అవసరాలు వివరిస్తూ, కలసిఉంటే కలదు సుఖం అనే తత్వాన్ని పిల్లలకి బోధిస్తూ ఉంటుంది.
ఇందులో జానపద కథలున్నాయి, సాంఘిక కథలున్నాయి, పురాణ కథలున్నాయి. అన్ని రకాల కథలను అలతి అలతి పదాలతో అతి సొగసుగా చెబుతూ, ఉత్కంఠతో చదివించే శక్తిని పుష్కలంగా సంతరింపజేయగలిగారు రచయిత్రి హైమావతి గారు.
- ద్విభాష్యం రాజేశ్వరరావు
గమనిక: " కథాసుధ" ఈబుక్ సైజు 5.6 mb

- ₹78
- ₹243.6
- ₹480
- ₹174.96
- ₹495.6
- ₹135.6