-
-
కథలు - హాస్య కథలు
Kathalu Hasya Kathalu
Author: Bhimaraju Venkata Ramana
Publisher: Palapitta Books
Pages: 112Language: Telugu
కథ చదివి కథ రాయకుండా, అనుకరించకుండా, తన చుట్టూ ఉండే పరిచయమైన జీవితం గురించి, మనుషుల గురించి, మానవ సంబంధాల గురించి, పరిశీలించి కథా వస్తువుల్ని ఎన్నుకున్నాడు భీమరాజు వెంకటరమణ. మన నిత్యజీవితంలో చూసే మనుషుల కథలన్నమాట. చిన్న చిన్న వైఫల్యాలు, విజయాలు, లోభాలు, ప్రలోభాలు, మనిషికి సహజంగా ఉండే మంచితనం, అంతే సహజమైన ఫూలిష్ నెస్, తొందరపాటు వగైరాలతో పాటు జీవితంలో ఏర్పడ్డ అసంతృప్తిని గుర్తించడం, ఒక మంచి పని చేసి నిశ్శబ్దంగా ఆనందించడం, పొరపాట్లను గ్రహించడం వంటి ఉదాత్తమైన అంశాలు ఈ కథల్లో కనిపిస్తాయి వెంకటరమణకి ఆశీస్సులతో...
- తల్లావజ్జల పతంజలి శాస్త్రి
ఈ ప్రపంచంలో ఏడిపించేవాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నది. నవ్వించేవాళ్ళు తగ్గిపోతున్నారు. భీమరాజు వెంకటరమణ రెండవరకం. అందరూ హాయిగా ఉండాలి, ఆనందంగా నవ్వుకోవాలని కోరుకుంటాడు. ఆయన కథలు కూడా సున్నితమైన హాస్యంతో గిలిగింతలు పెడతాయి. నవ్వే అదృష్టం మనిషికి మాత్రమే ఉన్నపుడు, మనిషి తనకు లేనిదాన్ని తలుచుకుని ఏడుస్తుంటాడు. మన కథా విమర్శకులు కూడా ఏడ్చే కథల్ని ప్రేమించినట్టు నవ్వే కథల్ని ప్రేమించలేరు. జీవితం సీరియస్గా ఉంటే టీవీ సీరియల్ లా అయిపోతుంది. ఏళ్ళతరబడి వెంటాడుతుంది. ఈ సంపుటిలో కథలు నేలమీదే ఉంటాయి. గాలిలో నడవవు. మన ప్రక్కింట్లో చూసే పాత్రలే అనిపిస్తాయి. మన చుటూ జరిగే చిన్నచిన్న సంఘటల్ని ఫోటోగ్రాఫ్ తీసి, లేదంటే కేరికేచర్ గీసి చూపిస్తారు. తొమ్మిది కథల్లోనూ చమత్కారం, క్షీన్ హ్యూమర్ ఉన్నాయి. రచన శైలి చదివిస్తుంది. లోనికెళ్ళి హాయిగా నవ్వుకోండి.
- జి. ఆర్. మహార్షి
