-
-
కథకు కథ
Kathaku Katha
Author: Bhimaraju Venkata Ramana
Pages: 144Language: Telugu
ఓ రచయిత కొన్ని పాత్రల్ని ఎంచుకొని, కొన్ని సంఘటనల సమాహారంగా కథని చెప్తూ, దానికో ముగింపు ఇచ్చాక అక్కడి నుంచి మరలా కథని కొనసాగించడమంటే ఆ రచయితకది కత్తిమీద సాము లాంటిదే. గొలుసు నవల రాయడంలో ఈ ఇబ్బంది ఉండదు. ఓ రచయిత ఓ చాప్టర్ రాశాక దాన్ని పొడిగించడానికి అవకాశముండేలానే ముగిస్తాడు. అది నవలాంతం కాదు. గొలుసు నవల రాస్తున్న చివరి రచయితకు మాత్రమే నవలకు ముగింపుని సూచించే అవకాశం ఉంటుంది. ఈ కథా సంపుటి 'కథకు కథ' లో భీమరాజు వెంకట రమణకు ఆ వెసులుబాటు లేదు. కథ ముగింపు నేను చెప్పేశాను. అలా ముగిసిపోయిన కథ నుంచే కథను ఎత్తుకొని అవే పాత్రల సహకారంతో కథను ముందుకు తీసుకెళ్ళి, దానికి మరో కొత్త ముగింపునివ్వడమే గొప్ప సాహసకార్యం. అటువంటి క్లిష్టమైన ప్రక్రియని సునాయాసంగా సాధించి, కథా సంపుటాల్లో ఇటువంటి ప్రయోగం చేసి కొత్త ఒరవడిని సృష్టించిన భీమరాజు వెంకట రమణకు మనసారా అభినందనలు తెలియచేస్తున్నాను. నా కథల్ని తన సీక్వెల్ కథల ప్రయోగానికి ప్రయోజనకారిగా తలచి, వాటిని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు కూడా...
- సలీం
