• Kathakruthi 2
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కథాకృతి-2

    Kathakruthi 2

    Author:

    Pages: 296
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నాటి, నేటి కథానికలన్నింటినీ చదువుతూ పాత రచయితల ప్రత్యేకతల్ని విశ్లేషిస్తూ, ఈ నాటి రచయితల రచనలలో ఏమైనా లోపాలనిపిస్తే వాళ్ళు నొచ్చుకునేట్టు విమర్శించకుండా, రచయితలు తమ లోపాలు తాము తెలుసుకునేట్టు చేస్తూ-వాళ్ళు ఇంకా మంచి కథానికలు రాసే విధంగా భుజం తడుతూ చెప్పే వ్యాసాలెన్నింటినో, ఎన్నో పత్రికలలో రాసారు, రాస్తున్నారు శ్రీ విహారి.

కథానిక చిన్నదిగా ఉంటుంది. పెద్ద పెద్ద విషయాల్ని అలవోకగా చెబుతుంది. చెప్పే దానికన్నా ఆలోచింపచేసేది ఎక్కువ. అలాగే విహారిగారు వ్యాసాలు చిన్నవిగా ఉంటాయి. రచయిత(త్రి) గురించే కాకుండ కథానిక ప్రక్రియ గురించీ భిన్నభిన్న విషయాలు చెబుతుంది ఒక్కో వ్యాసం. ఆ కథానిక గురించి ఆ రచయిత(త్రి) గురించి, వారి కథానికల గురించి క్లుప్తంగా చెప్పినా-మనకి కథానిక గురించి, వాళ్ళ గురించి, వాళ్ళ రచనల గురించి ఎంతగానో అర్థమయ్యేలా స్పష్టమైన ఆలోచనలు కల్గుతాయి.

కథానికకి క్లుప్తత, స్పష్టతతోబాటు ఏకాంశం ముఖ్యం. ఈ వ్యాసాల్లో విహారి గారు ఒక కథానిక ద్వారా, ఆ రచయిత(త్రి) విశ్వరూపం మనకు అర్థమయ్యేలా చెప్తారు. మంచి కథానికా రచయిత వ్యక్తిగత కోణం నుంచి కాక సామాజిక కోణం నుంచి విషయాన్ని చూస్తూ రాస్తారు. విహారిగారు విమర్శ పేరుతో రచయిత లోపాల్ని లాగి మనముందు పడేయాలని ప్రయత్నించక, ఆ రచయిత(త్రి) సామాజిక బాధ్యతగా మరింత మంచి కథానికలు రాయడానికి అవసరమైన ఉత్సాహాన్నందించేట్టు రాశారు ఈ వ్యాసాల్ని.

- వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Kathakruthi 2