• Kathakeli
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కథాకేళి

    Kathakeli

    Publisher: J.V.Publications

    Pages: 456
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆడవాళ్లని రాయమంటే ఏం రాస్తారులే అత్తగారు, మొగుడు, పిల్లలగురించి, వంటలగురించి తప్ప వాళ్లకేం తెలుసు అన్న మాట చాలాకాలంగా వింటున్నాం... ఇది చాలా తప్పుడు మాట అని నిరూపిస్తున్నారు నేటి రచయిత్రులు. ఇటీవల తెలుగు టైపింగ్, ప్రచురణ సులువుగా మారడంతో చాలామంది తమ రచనలను పుస్తకరూపంలో వెలుగులోకి తీసుకొస్తున్నారు.

జె.వి.పబ్లికేషన్స్ అధినేత్రిగా నేను చేసిన మరో ప్రయోగం ఈ కథాకేళి.. అందరం కలిసి కథలు రాద్దాం. మెగా పుస్తకంగా తీసుకొద్దాం అన్నాను. నా ఆలోచనకు సై అన్నారు.... ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. 111 మంది ప్రమదలు రాసిన కథలతో అందమైన కథాకదంబమాలగా తయారయింది.

ప్రపంచవ్యాప్తంగా 25 నుండి 85 ఏళ్ల వరకు వయసు ఉన్న రచయితలు ఉత్సాహంగా ఈ పుస్తకంకోసం తమ కథలను పంపించారు. అందరూ కూడా ఎన్నో భిన్నమైన అంశాలను తీసుకుని కథలుగా మలిచారు. 111 కథలకు ఎన్నుకున్న కథాంశాల వైవిధ్యం చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది.

ఈ కథా యజ్ఞంలో పాలుపంచుకున్న వారిలో పేరెన్నిక గన్న సీనియర్ రచయిత్రులున్నారు. ఇప్పుడిప్పుడే రచనా వ్యాసంగం ఆరంభించి పాఠాలు నేర్చుకుంటున్న పసి రచయిత్రులున్నారు. అసలు ఇంతవరకు కథలు రాయాలనే ఆలోచన ఉన్నా సాహసం చేయనివారున్నారు. చేయి తిరిగిన వ్యాస రచయిత్రులు, కవయిత్రులు... ఇంకా వివిధ సాహితీ ప్రక్రియలలో నిష్ణాతులైన సాహితీ ప్రియులంతా మేమున్నామంటూ కదలి వచ్చారు.

111 మంది మహిళా రచయితల కథలతో 2021 నూతన సంవత్సర, సంక్రాంతి కానుకగా వచ్చింది. అంతేకాదు ఈ పుస్తకం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా సరికొత్త రికార్డు సృష్టించింది.

- జ్యోతి వలబోజు

గమనిక: "కథాకేళి" ఈబుక్ సైజు 8.7 mb

Preview download free pdf of this Telugu book is available at Kathakeli