• Kathakasham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కథాకాశం

    Kathakasham

    Author:

    Publisher: Palapitta Books

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక కళారూపంగా కథాప్రక్రియకు వున్న పరిధి స్వామికి తెలుసు. కథని కథగానే చెప్పాలి. సన్నివేశాల కల్పన సహజంగా ఉండలి. వాస్తవానికి దగ్గరగా చిత్రితమవ్వాలి. నేరుగా సందేశం ఇస్తున్నట్టుగానో, ప్రబోధాలు చేస్తున్నట్టుగానో ఉండకూడదు. కథ చదివిన పాఠకునిలో తెలియకుండనే ఒక హృదయ సంస్కారాన్ని ప్రోది చేయాలి. ఈ పని చేస్తాయి స్వామి కథలు. క్లుప్తత, సంక్షిప్తత ద్వారా దీన్ని సాధించారు.

వాతావరణ చిత్రణ, మనుషుల స్వభావాల్ని విపులీకరించే తీరు, భాషలోని సొగసు స్వామి కథలకు నిండుదనాన్ని ఇచ్చాయి. కథకు ఉండల్సిన సౌందర్యాత్మక విలువల్ని స్వామి విస్మరించలేదు. దీనిని గుర్తిస్తూనే కథారచనలో తనదైన దారిని నిర్మించుకున్నారు. ఈ క్రమాన కథారచనలో పరిపూర్ణతని సాధించనికి సుదీర్ఘమైన జీవితానుభవం, అధ్యయనం, రచనానుభవం స్వామికి తోడ్పడ్డాయి.

ముఖ్యంగా ఎలాంటి తీవ్రతలకు లోను కాకుండా కథనం సాఫీగా సాగిపోవడం స్వామి కథల్లోని ప్రధాన ఆకర్షణ. ప్రసిద్ధ రచయిత బుచ్చిబాబు గారు అంటారు- ''పాత్రలకు ఉద్వేగాలు ఉండొచ్చు గానీ రచయిత ఆవేశకావేషాలకు లోను కాకూడదు'' అని. ఈ సూత్రం స్వామికి బాగా తెలుసని వారి రచనలు చెబుతాయి.

మంచి దిశగా మనుషుల ఆలోచనల్ని నడిపించం స్వామి సాహిత్య స్వభావం. దీనికి అనుగుణంగా కొనసాగుతోంది వారి సాహిత్య ప్రయాణం. ఈ క్రమాన స్వామి కథలు చదివింపజేస్తాయి. ఆ దరిమిలా ఆలోచింపజేస్తాయి. సహృదయులైన పాఠకుల మానసిక ప్రపంచంలో కదలికను తీసుకొస్తాయి. అందుకే స్వామి కథలకు స్వాగతం చెబుదాం.

- గుడిపాటి

Preview download free pdf of this Telugu book is available at Kathakasham