-
-
కథాకదంబం
Kathakadambam
Author: Manchi Pustakam
Publisher: Manchi Pustakam
Pages: 200Language: Telugu
Description
50 కార్డులలో పిల్లల కోసం రూపొందించిన బొమ్మల కథలు ఇవి. చిన్న చిన్న పదాలతో, పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా చెప్పబడిన కథలివి.
ఇందులో జంతువుల కథలు, పక్షుల కథలు, తెనాలి రామలింగడి కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, మర్యాద రామన్న కథలు, మౌల్వీ నసీరుద్దీన్ కథలు, అక్బర్ బీర్బల్ కథలు వంటివి ఉన్నాయి.
అంతే కాదు, చిట్టి పొట్టి గీతాలు కూడా ఉన్నాయి.
ఆయా కథలకి గీసిన బొమ్మలు సహజత్వంతో అద్భుతంగా ఉన్నాయి. బొమ్మలకి వాడిన రంగులు, ఆయా రంగుల మిశ్రమం కథల వాతావరణంలోకి పిల్లలు ఆసక్తిగా ప్రవేశించేలా చేస్తాయి.
పిల్లల కోసం ఉద్దేశించినా, వీటిని పెద్దలు సైతం చదువుకోవచ్చు. తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు కూడా ఇది చదివి వారి బాల్యంలోకి వెళ్ళిన అనుభూతి పొందవచ్చు.
Preview download free pdf of this Telugu book is available at Kathakadambam
నేను మా బాబుకి చదివి వినిపించినవతిలో ఈ రెండు అసంపూర్ణంగా ఉన్నాయి (కనీసం ఉన్నట్లు అనిపించాయి): మట్టికుండ - పెనం, పిల్లి మెడలో గంట. ఆ తరువాతి కథలు ఇంకా చదవలేదు.
గుత్తికొండ గారు,
అవును. ఈ పుస్తకాలు చాలా బాగున్నాయి. ప్రతి కథను గరిష్టంగా నాలుగు పుటలలో ఉంచాలి అనే డిజైన్ వల్ల కొన్ని కథలు క్లుప్తంగా వ్రాసినట్టున్నారు. అలా కాకుండా ఏదన్నా కథ అసంపూర్ణంగా ఉంటే ఉదాహరణతో ఇవ్వగలరు. పబ్లిషరు దృష్టికి తీసుకువెళతాము.
ఈ పుస్తకం నాణ్యత చాలా బాగుంది. కానీ, అక్కడక్కడ కథలు అసంపూర్ణంగా ఉన్నాయి.