-
-
కథ నేపథ్యం 2
Katha Nepathyam 2
Author: Multiple Authors
Publisher: TANA Prachuranalu
Pages: 544Language: Telugu
34 మంది కథకుల కథలు, వాటి నేపథ్యాలే ఈ సంపుటం. ఆర్. యమ్. ఉమామహేశ్వరరావు, జంపాల చౌదరి, వాసిరెడ్డి నవీన్‌ల సంపాదకత్వంలో తానా ప్రచురించిన పుస్తకం ఇది. కథ నేపథ్యం సంపుటాలలో ఇది రెండవది. మొదటి సంపుటం ఇక్కడ.
* * *
కథలు ఎలా పుడతాయి? మాములు కథల పుట్టుకకు, మంచి కథల పుట్టుకకు తేడా ఏమన్నా ఉంటుందా? కొన్ని కథలు, ముఖ్యంగా గాఢంగా ముద్రవేసిన కథలు, ఎక్కడ నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో తెలుసుకోవాలన్న కుతూహలం పాఠకుడిగా, మానసిక శాస్త్ర విద్యార్థిగా తరచు కలుగుతూ ఉంటుంది. రచయితలను కలిసినప్పుడు, చాలా మంది పాఠకుల్లాగే, నేను కూడా వారి కథల గురించి మాట్లాడుతూ, ఆ కథల మూలాల గురించి వారి ముఖతా వినేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను.
ఇంతకీ కథలు ఎలా పుడతాయి? ఎలా పెరుగుతాయి? ఏ పరిణామ క్రమంలో అండాలు పలుదశలు దాటి అందమైన సీతాకోకచిలుకలుగా మారి రెక్కలు విప్పుకుని మనముందు వాలతాయి? కథలు నిజాలా, కల్పనలా లేక నిజానిజాల కలగలుపా? నగిషీలతో అలంకరించి మనముందు అందంగా నిలబెట్టిన బొమ్మ పూర్వస్వరూపమేమిటో అన్న ప్రశ్నలకు జవాబులు ఈ కథల్లో, వాటి నేపథ్యాలలో వెతుక్కోవచ్చు. ఈ నేపథ్యాలు కొత్త ప్రశ్నలకు, చర్చలకు దారి తీయనూవచ్చు.
ఈ సంపుటంలో ఉన్న కథల్లోనూ, వాటి నేపథ్యాలలోనూ కొంత సామాన్యత, ఎంతో వైవిధ్యత ఉన్నారు. ఎవరి ముద్ర వారికి ఉన్నా, ఈ కథల్లో ఎక్కువ భాగం సంప్రదాయ శిల్పంలో చెప్పినవే. దాదాపుగా అందరు రచయితలూ తమ స్వానుభవాలు లేక తాము విన్న, కన్న విషయాల నుంచే ఈ కథలు పుట్టాయి అని చెప్తున్నారు. అయితే ఆ విత్తనాలు కథలుగా మొలకెత్తిన తీరులో ఎంతో వైవిధ్యం ఉంది.
ఈ కథలూ, నేపథ్యాలూ పాఠకులకు, ఔత్సాహిక, వర్ధమాన రచయితలకు కరదీపికగా ఉపయోగిస్తాయని మా నమ్మకం, ఆకాంక్ష.
- జంపాల చౌదరి

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE