-
-
కథా జగత్
Katha Jagat
Author: Kodihalli Murali Mohan
Language: Telugu
సాహిత్య ప్రక్రియ లన్నింటిలో కథకు ప్రత్యేకత ఉంది. గ్రంథాన్ని పట్టి చదివించే గుణం కమ్మని కథకు ఉంటుంది. అంతేకాదు, సామాజికులకు చెప్పదలచుకొన్న నీతికూడా చక్కగా బోధపడుతుంది.
-డాక్టర్. వి.వి.యల్. నరసింహారావు
లోకమంతా కథా ప్రక్రియకు అనుగుణమైనదే. అవసరమైనదే, ప్రపంచమంతా కథలో ఇముడుతుంది. ఇమిడ్చవచ్చు. ప్రపంచంలోని వస్తువే కథా వస్తువు. ప్రపంచం వినా కథకు వస్తువు లేదు. అయితే కథా రచయిత దృష్టిలో ఎవరి ప్రపంచం వారిది. రాసేప్పుడు ఇదే ప్రపంచమనుకుంటాడు రచయిత. అట్లా అయితేతప్ప కలం సాగదు. కథనడవదు. తనకు అవగాహన అయినంత మేరకు జగత్తును గూర్చే రాస్తాడు రచయిత. తన ముందు జగత్తులేక పోతే కథ రాయలేడతడు. రాడయం కుదరదు. ప్రతి కథా అందువల్ల జగత్కథే అవుతుందనుకోవాలి. అట్లా అని కనీసం భ్రమిస్తాడు. తన రచనని తాను ప్రేమిస్తాడు.
-డాక్టర్. అక్కిరాజు రమాపతిరావు. (మంజుశ్రీ)
