-
-
కథ 2011
Katha 2011
Author: Katha Sahiti
Publisher: Katha Sahiti
Pages: 174Language: Telugu
సాహిత్యంలో ఒక రూపం కథ. సాహిత్యమెంత శాశ్వతమో కథలూ అంతే శాశ్వతం.
2011 సంవత్సరంలో వివిధ పత్రికలు, అంతర్జాల పత్రికలు, సంపుటాల్లో అచ్చయిన వందల కథల నుంచి ఏరికూర్చిన 13 కథల సమాహారం ఈ సంకలనం.
ఈ సంకలనం లోనివి - కొన్ని బలమైన వస్తువుతో, మరికొన్ని గొప్ప ఊహాశక్తితో, ఇంకొన్ని చక్కని మాండలికంలో, కొన్ని వ్యంగ్య ధోరణిలో నడిచే కథలు. వస్తురూపాల విషయంలో వేటికవే ప్రత్యేకతలున్న కథలివి. అదే సందర్భంలో కొన్ని సారూప్యతలూ ఉన్నాయి. దేశాలు, ఎల్లలు వేరు కావచ్చు, సందర్భాలూ వేరు కావచ్చు.
ఇందులోని కథలు:
1. సరిహద్దు: -- సాయిబ్రహ్మానందం గొర్తి
2. ఖేయోస్: -- బి. అజయ్‌ప్రసాద్
3. ఒక బంధం కోసం: -- అరుణ పప్పు
4. జీవం: -- స్కైబాబ
5. తప్పు: -- సతీష్‌చందర్
6. ఋణం: -- ముళ్ళపూడి సుబ్బారావు
7. తల్లి భూదేవి: -- వల్లూరు శివప్రసాద్
8. ఇప్పమొగ్గలు: -- మల్లిపురం జగదీశ్
9. టెంకిజెల్ల: -- కె. ఎన్. మల్లీశ్వరి
10. అవ్వ: -- కె.వి. నరేందర్
11. సముద్రం: -- రమణజీవి
12. మూడు తొవ్వలు: -- బెజ్జారపు రవీందర్
13. కొత్తగూడెం పోరడికో లవ్ లెటర్: -- సామాన్య
వైవిధ్యభరితమున్న వస్తువుతో, రూపంతో ఉన్న ఈ కథలు నిస్సందేహంగా మంచి కథలే.
.