-
-
కథ 2010
Katha 2010
Author: Katha Sahiti
Publisher: Katha Sahiti
Language: Telugu
ఈ సంవత్సరం వెలువడిన కథలకు చిన్న నమూనా లాంటిది ఈ సంకలనం. ఎందుకంటే, మూడు ప్రధాన ధోరణులు ఈ సంకలనంలోని కథల్లో చోటు చేసుకున్నాయి. చిత్రలేఖ, చిట్టచివరి సున్నా...., ట్రోజన్ హార్స్, కాక్టెయిల్, అతీతం, ఇన్సైడర్ - ఈ కథలు బహుశా ఈ కాలంలో మాత్రమే రావడానికి అవకాశమున్న కథలు. సమాజంలోని సమస్యలు సంక్లిష్టతని సంతరించుకున్నప్పుడు రచయిత సైతం ఆ సంక్లిష్ట రూపంలోనే కథ చెప్పడం అనేది ఒక అనివార్య పరిణామం.
గెట్ పబ్లిష్డ్, గారడీ, పాఠాంతరం, నిశ్శబ్ద స్వరం కథల్లో వ్యక్తమయ్యే నిరసన మృగ్యమవుతున్న మానవ విలువల పట్ల నిరసన కావచ్చు, లేదా నేటి సమాజంలో చోటు చేసుకుంటున్న అమానవీయ ధోరణి పట్ల నిరసనా కావచ్చు.
H. నరసింహం ఆత్మహత్య, కొత్తరంగులద్దుకున్న కల, రణనినాదం అను 7 ఎపిసోడ్ల కథ - ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణాలో సాగుతున్న ఉద్యమాన్ని ఆవిష్కరించిన కథలు. ఈ మూడు కథలూ రూపం రీత్యా దేనికవే భిన్నమైనవి.
వాసిరెడ్డి నవీన్
Review of this book on pustakam.net http://pustakam.net/?p=10477