• Kasepu Navvukundam
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాసేపు నవ్వుకుందాం

    Kasepu Navvukundam

    Publisher: Victory Publishers

    Pages: 84
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


'డాక్టర్‌ - నేనిలా పడుకొంటానో లేదో - అలా గురక మొదలవుతుంది!'
'మరీ గట్టిగా గురక పెడతారా ?'
'అవును. చాలా గట్టిగా.
'మీ గురక మూలంగా - మీ ఆవిడ ఇబ్బంది పడుతున్నారా?'
'నాకు మేరేజి కాలేదండి'
'అయితే సమస్యే లేదు కదా -'
'ఎందుకు లేదండీ? - ఇప్పటికి అయిదు ఉద్యోగాలు ఊడగొట్టుకొన్నానండి!

* * *


డాక్టర్‌ ఆపరేషన్‌ థియేటర్నుంచి ఇవతలికొస్తూ
''చూడమ్మా - మీ ఆయనకి చేసిన ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది! కొద్దిసేపట్లో ఆయనకి తెలివోస్తుంది'' అన్నాడు.
''మీరెంత అమాయకులండి డాక్టర్‌గారూ - మా ఆయన శుద్ధ వెఱ్ఱిబాగులాయన. ఆయనకి తెలివితేటలొస్తాయంటే -నేను ఛస్తే నమ్మను.'' అందా ఇల్లాలు.

* * *


''సిగరెట్లు కాల్చడం వలన నష్టాలే కానీ లాభాలేమీ లేవంటారా?'' చైన్‌స్మోకర్‌ సూర్యారావ్‌ డాక్టర్ని అడిగాడు.
''లేకేం. రెండు లాభాలున్నాయి!'' అన్నాడు డాక్టర్‌.
''అయితే అవేమిటో చెప్పండి'' ఆతృతగా అడిగాడు సూర్యారావ్‌.
''మొదటిది - మీ ఇంట్లో దొంగలు పడరు-''
''ఎందుకని?!''
''సిగరెట్లు కాల్చడం వల్ల మీరు అదే పనిగా దగ్గుతూ ఉంటారు. అందుకని దొంగలు పడరు.''
''రెండో లాభం ఏమిటో చెప్పండి.''
''మీకు ముసలితనం రాదు.''
''అదెలా??''
''ఏముంది ? మీరు ఏభైయేళ్లు దాటకుండానే చనిపోతారు కాబట్టి.''
''ఆ!!-''

Preview download free pdf of this Telugu book is available at Kasepu Navvukundam