-
-
క. సా. గు.
Kasagu
Author: Nemalikanti
Publisher: Self Published on Kinige
Pages: 29Language: Telugu
క. సా. గు.
సాంఘిక నాటిక
ఓ ఎయిడెడ్ స్కూల్లో లెక్కల మాష్టారుగా రిటైర్డ్ అయిన ఓ సాధారణ వ్యక్తి. ఏకైక కూతురు ప్రతీక. ఇంజనీరింగ్ స్టూడెంట్. బావమరిది మాధవ. ఓ సాధారణ లాయర్. నిజాయితీకి బావగారైన ధర్మారావుకు సరైన జోడి. పూర్ణ మాష్టారి కుటుంబానికి సన్నిహితుడు. ప్రత్యేకించి ధర్మారావుగారి శిష్యుడు. ధర్మారావు, మాధవలకు పూర్ణ ఏమాత్రం తీసిపోడు. డిగ్రీ కంప్లీట్ చేసి ఉద్యోగాల కోసం పల్లెటూరి నుంచి పట్నానికి వలస వచ్చిన ఓ నిరుద్యోగి.
పూర్ణ వయసు రీత్యా యువకుడైనా తన స్థితి గతులు బేరీజు వేసుకొని తన ప్రేమను బైటికి వ్యక్తంచేయలేక తనకు తాను జీవితాన్ని బలిచేసుకునే యువకుడికి ప్రతీక.
మాధవ ‘లా’ చదివి వచ్చిన కేసులు అన్నిటిని ఒప్పుకొని రెండు చేతులా సంపాదనలో మనస్సాంతి లేదని, నిజమైన కేసుల్లో తనకు నచ్చిన కేసుల కోసం ఆర్థిక విషయాన్ని కూడా పక్కన పెట్టే నిజమైన న్యాయవాదికి ప్రతీక.
ధర్మారావు చేసింది లెక్కల మాష్టారుగా అయినా సమాజాన్ని క్షుణ్ణంగా భాగించి, తన ఆర్థిక స్తోమత సహకరించకపోయినా ఉన్న ఒక్కగానొక్క కూతురు ఉజ్వల భవిష్యత్ ఇవ్వాల్సిన బాధ్యత తండ్రిగా తనపై ఉందని ఎన్నో ఒడుదుడుకులకు తట్టుకొంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న సాధారణ సగటు మనిషికి ప్రతీక.
ప్రతీక హయ్యర్ ఎడ్యుకేషన్లో హయ్యర్ కల్చర్ అని సంస్కృతీ సంప్రదాయాలని దాటి, పాశ్చాత్య నాగరికత పట్ల ఆకర్షితురాలై అటు పోలేక, ఇటు కాదనలేక సంఘర్షణకు లోనై తప్పుటడుగులతో జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకునే నేటి యువతీ, యువకులకు ప్రతీకే ప్రతీక.
స్వసాంప్రదాయాల్ని, సంస్కృతిని మరిచి నేటి యువతరం పాశ్చాత్య నాగరికత పట్ల ఆకర్షితులై, పుట్టి పెరిగిన జన్మభూమిని ఖర్మకి వదిలి, కరన్సీలకు విదేశాలకు వలసలై, కని, పెంచి, పెద్ద చేసి తమకు అండగా నిలుస్తారనుకున్న తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యేలా ప్రేమ పంజరాల్లో బందీలై సహజమైన వయసు ఉద్రేకాలకు లోనై, విలాసవంతమైన జీవితాలకి అలవాటయ్యో, ఆ సంపాదనల పరుగు, పందెంలో బిజియై, ఆత్మీయతలకు, అనురాగాలకు దూరమై, ఏ ప్రేమకై ఏకమయ్యారో అదే ప్రేమను సైతం అవహేళన చేసి మరో,మరో వ్యక్తులపై పాత ఒక రోతగా, కొత్త ఒక ఉన్మాద చర్యలకు ప్రభావితులయ్యేలా దారి తీసే కారణాలను అన్వేషించి ఓ సరిసంఖ్యతో గుణించి చక్కని జవాబు చెప్పటానికి చేసే చిరు ప్రయత్నమే ఈ క.సా.గు.
