-
-
కరువు కురిసిన మేఘం
Karuvu Kurisina megham
Author: Y.H.K.Mohan Rao
Language: Telugu
అప్పుడు కోడిపందాలయితే, యిప్పుడు నేటి రాజకీయాలంటున్నాడు మోహనరావు. నాకు ఆశ్చర్యం, ఆనందం ఏమిటంటే వీళ్ళ ధైర్యం, తెగువ, తెంపరితనం – adverse circumstances ని ఆశతోను, అత్యంత జీవన ప్రేమతోను, ఎదుర్కోవటం. నీరు పుష్కలంగా వున్న ప్రాంతంలో బతకటం వేరు, జనజీవితం వేరు. నీరు దొరకని ఎడారి ప్రాంతపు జీవితాన్ని లాగటం మామూలు విషయం గాదు. ఇక్కడి వాళ్ళకున్న జీవన వైఖరిని, grit ని నరకంలో అయినా స్వేచ్ఛనీ, వ్యక్తిత్వాన్నీ కాపాడుకునే లక్షణం.
వీళ్ళదయిన, వీళ్ళకే చెందిన ఒక సంస్కృతి వుంది. జీవన విధానం వుంది. ఒక spirit ని బతికించుకునే సత్తువ, తెగువ – బహుశ కొన్ని వేల సంవత్సరాల నుంచి వీళ్ళకి సంక్రమించి వుంటుంది. రక్తనిష్ఠపై వుంటుంది. జీవన వైరుధ్యాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగటం – అది వారి జీవనశైలి. ఆ ప్రాంతానికే ప్రత్యేకమయిన వ్యక్తిత్వం, ఆ ప్రాంతపు భౌతిక వాస్తవికత నుంచి జన్మిస్తుంది. ఆ ప్రాంతపు ఆంతరిక జీవన సంస్కారధార, ఆ ప్రాంతపు భౌతిక భౌగోళిక వాస్తవాల నుండి దూసుకొస్తుంది. ఏ ప్రాంతానికా ప్రాంతమే ప్రత్యేకమయినది. ఆ ప్రాంతానికే చెందిన జానపదగాథలు, పురాణగాథలు, చారిత్రిక పురుషులు– ఆ సంస్కృతిలో భాగం – ఇది అనుస్యూతంగా కొనసాగుతూ వర్తమానాన్నే గాక భవిష్యత్తరాల జనుల్ని ప్రదీప్త చేస్తుంది. చరిత్ర పునరావృతమౌతుందా – పునరావృతమయినట్టు కనపడ్డా readjust అవుతుంది. పరిస్థితుల కనుగుణంగా సర్దుబాటులు చేసుకుంటూ, పనికిరానిదాన్ని వదిలించుకుంటూ ముందు కెడుతోంది. ఆ ప్రాంత ప్రజకు సామూహిక స్మృతిలో యిది భాగమవుతుంది.
ఏ ప్రాంతపు నిర్దిష్టత ఆ ప్రాంతానిదే. ఒక ప్రాంతానికి చెందిన కవీ, రచయిత వీటంటిలో భాగమవుతాడు. వీటన్నింటినీ స్వీకరించి అంతర్నివహం చేసుకుంటాడు. నిర్దిష్ట ప్రదేశం, నిర్దిష్ట పరిస్థితీ, నిర్దిష్ట వాస్తవికత వున్నా – ప్రాంతపు కవి వీటంటిని గుర్తిస్తూనే, వీటంటినీ అంతర్లీనం చేసుకుంటూనే, స్పందిస్తూ చైతన్యవంతుడవుతూనే–ఆ నిర్దిష్టతని దాటి ప్రపంచపు మానవాళితో గొంతు కలపటానికి ప్రయత్నిస్తాడనుకుంటా – అదే ఒక కవిత్వంలో జీవధార. ఒక కవి నిర్దిష్టమౌతున్నాడంటే, పరిమితమౌతున్నాడని అర్థం కాదు. ప్రత్యేక పరిస్థితిని గుర్తిస్తూనే, అనుభవిస్తూనే, దాన్ని అఖండ మానవాళి అనుభవంలో భాగం చేయటానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం.
“ఎక్కడ్నుంచి వచ్చామో తెలుసుకోలేకపోతే
ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలుసుకోలేము”
మోహనరావుకి చాలా స్పష్టమైన రాజకీయ అవగాహన వుంది, సామాజిక బాధ్యత వుంది. తన మూలాలు ఎన్నడూ మర్చిపోలేదు. మార్పులు ఒక ప్రాంతానికే పరిమితంగావు. అంతటినీ ఆవరించి అన్నింటినీ కబళిస్తాయి. ................
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.