-
-
కార్మిక గీతం
Karmika Geetham
Author: Akkineni Kutumbarao
Publisher: CITU State Committee
Pages: 288Language: Telugu
రచయిత ఎన్నో సంవత్సరాల అధ్యయనం - కంపెనీల్ని, కార్మికుల్ని, పేదరికాన్ని, పేదరికం వల్ల వచ్చిన బేలతనాన్ని యాజమాన్యాల దాష్టికాన్ని, సంఘటితమయ్యేందుకు కార్మికులు చేసే ప్రయత్నాల్ని, వాటిని భగ్నం చేసేందుకు యాజమాన్యాల కుట్రలను ఈ నవల్లో అత్యంత ప్రతిభావంతంగా మలిచారు.
''ఎవరికీ పట్టని కార్మికుల జీవితాలు'' అధ్యయనం చేయడమే గాక, దాన్ని కథా వస్తువుగా ఎంచుకుని నవలగా మలచడానికి ధైర్యం చేసిన కుటుంబరావు గారు ధన్యులు. ''ఈ పుస్తకం హస్త భూషణం'' గా మిగలరాదని, అదో చైతన్యదీప్తిగా ఉండలన్న విషయం సామాజిక స్పృహ వున్న వారంతా అంగీకరించే సత్యం. అదే కుటుంబరావు గారూ చేశారు. చెలం అన్నట్లు ''కాలికింద పడి నలిగిన గడ్డి పూవు ఆర్తనాదం, విరిగిన చీమకాళ్ల చప్పుడు వినే ప్రయత్నం'' చేసిన కుటుంబరావు గారికి కార్మికలోకం రుణపడి ఉండలని నా ఆకాంక్ష.
- ఆర్. సుధాభాస్కర్
''మనం పనులు చేస్తున్నాం. ఉత్పత్తులు పెంచుతున్నాం. మనం ఎక్కడ పనిచేస్తున్నామో ఆ భూములు, ఫ్యాక్టరీలు చాలా కొద్దిమంది ధనవంతుల చేతుల్లో వున్నాయి. అందువల్ల వాటిల్లో మనం ఎంత పనిచేసినా మనం పెంచిన ఈ సంపదలన్నీ ఒక పెద్ద ప్రవాహంలా ఆ కొద్దిమంది ధనవంతుల చేతుల్లోకే చేరిపోతాయి, మనకి దారిద్య్రాన్ని ఆకల్నీ మిగిల్చి'' మరిక యిది యింతేనా కాదు. కారాదు. అంటున్న-
కార్మిక గీతం
చదవండి ! చదివించండి ! చదివి విన్పించండి !!
