-
-
కర్మయోగులు
Karmayogulu
Author: Puttaparthi Narayanacharyulu
Publisher: Self Published on Kinige
Pages: 36Language: Telugu
Description
ఈ పుస్తకములోని యిద్దంఱు వీరులును యించుమించు – ఒక శతాబ్దములోని వారే. కాకున్న నొకటి రెండు దశాబ్దములు ముందు వెనుకల జరిగెనేమో ! ఒకఁడు జాతి ధర్మమును బ్రతిష్టించుటకై బ్రయత్నించి కృత కృత్యుఁడైనవాఁడు. జంబుకేశ్వరుఁడు 'విశ్వ ధర్మ ప్రతిష్టాపనకై యత్నించి - తాను బలియైునవాఁడు. ఈ రెండు ఘట్టములందును బ్రజలు జూపిన చైతన్యము సామాన్యమైనది గాదు. కర్మయోగులకుఁ గలవిలువ వారి కార్య సాఫల్యతను బట్టి గాదు, వారి ప్రవృత్తిని బట్టి.
'ఆంధ్రజాతి' ' ఆంధ్ర దేశము' అను నావేశము- నాటిది నేటిది గాదు. అది బండ్రెండవ శతాబ్దముననే యారంభమైనది. దానికి శ్రీకారమును జుట్టిన కర్మయోగి, కాపయనాయకుఁడే. ఈ పుస్తకమున భాషను సాధ్యమైనంత సులభముగ వాడితిని తెలుగు పలుకుబడులనే యెక్కువగ నుపయోగించితిని.
- పుట్టపర్తి నారాయణాచార్యులు
Preview download free pdf of this Telugu book is available at Karmayogulu
Login to add a comment
Subscribe to latest comments

- ₹270
- ₹378
- ₹72
- ₹108
- ₹216
- ₹72