• Karimnagar Zilla Kathalu 3
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కరీంనగర్ జిల్లా కథలు - 3

    Karimnagar Zilla Kathalu 3

    Pages: 145
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కరీంనగర్ జిల్లా కథలు - 3

సంపాదకులు: బి. ఎస్. రాములు, వనమాల చంద్రశేఖర్


కరీంనగర్‌ జిల్లా కథలు సిరీస్‌లో ఇది మూడవ సంపుటి. ఈ సంపుటిలోని కథలకు ఒక ప్రత్యేకత వుంది. యువతరం కథకులతో పాటు సీనియర్‌ కథకులు కూడా యువతరంతో పోటీ పడి రాస్తున్న కథలు ఇందులో చోటు చేసుకున్నాయి.


ఈ కథల సంపుటిలో వస్తువు విస్తారమైనది. వైవిధ్యపూరితమైనది. 1947 నుండి 2011 వరకు సాగిన 60 ఏళ్ళ తెలంగాణ సమాజం చిత్రణ ఉంది. సంక్షిప్తంగా వీటిని ఇలా పేర్కొనవచ్చు.


1. తెలంగాణ స్వాతంత్య్ర ఉద్యమం - 'దాదాబాయి'
2. 1960 నాటి పల్లెలు, దొరలు, సామాన్యులు - 'మరిపించిన ముద్దు', 'కుక్కపన్ను'
3. 1980 నాటి పలెల్లోని వర్గ సంబంధాలు - 'కిరాయి బతుకులు' 'కుక్కపన్ను',
4. 1977 - 88 నాటి విప్లవం జీవితం తెచ్చిన మార్పులు - 'సహజాతాలు'
5.1990 - 2000 లో స్త్రీలు పెళ్లయ్యాక చదువుకొని ఉద్యోగాలు చేయడం - 'అలుపెరుగని మహిళ'
6. 1990 నుండి విప్లవంతో, విద్యతో, అధికారం బదిలీ కావడంతో మారుతున్న పల్లెలు, జీవితాలు - 'రాజవ్వ కొడుకు'.
7. 1990 నుండి సమాజంలోని మార్పులు ప్రేమలు - 'బంధుత్వం'.
8. భార్య, భర్తలు సంఘర్షణ, సఖ్యత - 'భారతి' 'అలుపెరుగని మహిళ', 'పొక్కిలి'
9. వ్యవసాయ జీవితాలు - 'పొక్కిలి'.
10. మానవ ప్రయాణం - 'చినుకు రాలినది', 'విధి'
11. ప్రపంచీకరణ ప్రభావాలు, వ్యక్తి స్వార్థం - 'భారతి', 'ఓదార్పునిచ్చిన మనిషి', 'పొక్కిలి'. 12. సైనికుల జీవితాలు - త్యాగాలు కుటుంబాలు - 'విధి'
13. చదువుకొని ఉద్యోగాలు చేసే స్త్రీల కుటుంబాలు, పెండ్లి సమస్య - 'నిర్ణయం'
14. పిల్లల సమస్య, నలుపురంగు సమస్య - 'కర్రోడు'.


ఇలా కరీంనగర్‌ జిల్లా ప్రజల నిర్దిష్ట జీవిత రూపంలో సార్వజనీన మానవ సంబంధాలు భారతీయ పరిణామంలో, సంస్కృతి, ఆత్మీయ సంబంధాలు, సంఘర్షణ, విప్లవ పరిణామాలు, కుటుంబ సంబంధాలు, భార్యాభర్తల అనుబంధాలు, సంఘర్షణ, వ్యక్తి స్వార్థం పెరిగి తల్లిదండ్రులను వదిలించుకొని తాము మాత్రమే బతకాలనుకునే స్వభావం, ఎదుగుతున్న దళితులు అందుకుంటున్న అభివృద్ధి సామాజిక గౌరవాలు, పిల్లల స్వభావాలు, బంధుమిత్రుల ప్రాధాన్యత, ప్రజల సంస్కృతి మొదలైనవి ఈ కథా సంపుటిలో చిత్రించబడ్డాయి. అలా ఈ కథల సంపుటి భారతీయ ప్రజల జీవిత పరిణామాలను ప్రతిఫలిస్తుంది. ఇందులోని కథలు రాసిన రచయితలకు హృదయపూర్వక అభినందనలు. మరింత వేగంగా కథలు రాయాలని, రాస్తారని ఆశిస్తాను.

- బి.ఎస్‌. రాములు

Preview download free pdf of this Telugu book is available at Karimnagar Zilla Kathalu 3