• Karachalanam
  • fb
  • Share on Google+
  • Pin it!
 • కరచాలనం

  Karachalanam

  Pages: 96
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

హృదయపు లాలిత్యానికి పెట్టింది పేరుగా లలనలను సంభావిస్తాం. ఓర్మి పాళ్ళు వారిలో ఎక్కువ, కనుకనే క్షమామూర్తులుగా ప్రధానంగా రూపుకడతారు. కాని అణచివేతను, ఆధిక్యతను ప్రశ్నించి తిరుగుబాటు చేస్తే ఆదిశక్తి ప్రతిరూపాలేవారు. అసమసమాజాన్ని మార్చగల ధర్మగ్రహ స్వరూపులుగా మారితే జాలికురిపించే కన్నే జ్వాల మెరిపించగలదు. కరచాలనం చేయగలవారే ఖడ్గచాలనం కూడా చేయగలుగుతారు. కానీ సారపు ధర్మానికీ, విమలసత్యానికీ ఉపేక్షచేయక ఉనికిని కాపాడగలవారు ఉవిచలే.

సృష్టి అంటేనే స్త్రీ. స్త్రీ సృజనమూర్తి అయితే ఆ సృజన గతానుగతిక భావాలకు అనుస్త్రజన కాదు. కాంతిచ్ఛటలను ప్రసరించగల నవాభ్యుదయ భావనలు ఆమె కలం నుండి ననలెత్తుతాయి. దయనీయమైన మూలుగులను అభ్యుదయశీలమైన వెలుగులుగా విస్తరింపచేయగల లక్ష్మీకళలు ఆమెవి.

నెల్లూరుకు చెందిన శ్రీమతి లక్ష్మీమైథిలీ తన కలం రచనంతో పాఠకులతో సృజనశీలిగా కరచాలనం చేయడానికి అభివ్యక్తీకరిస్తున్న కవితా ఖండికల సమాహారం ఈ సంపుటి. చేతులు కలసిన చప్పట్లే కాదు మనసులు కలిసిన ముచ్చట్లను కూడా పంచుతూ మనుషులను మానవీయ గమ్యంవైపు నడిపించే సందేశ భావకిరణాలు ఈ కవయిత్రివి.

- సుధామ

Preview download free pdf of this Telugu book is available at Karachalanam