• Kanya Lagnam
  • Ebook Hide Help
    ₹ 72
    120
    40% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కన్య లగ్నం

    Kanya Lagnam

    Publisher: Mohan Publications

    Pages: 163
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ద్వాదశ రాశులను గురించి లేదా ద్వాదశ లగ్నాల గురించి భారతీయ భావనలు ఎలా ఉన్నాయి. పాశ్చాత్యుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలియజేసే రచనలు తెలుగులో లేవనే చెప్పవచ్చును. రాశీ ఫలితాలు, పరిహారాలను గురించి తెలియజేసే పుస్తకాలున్నా ఖగోళం ఆ రాశీ స్వరూపం ఏమిటి, పాశ్చాత్యులు భావనలు ఎలా ఉన్నాయి వారు ఈ లక్షణాలను ఎలా విశ్లేషించారు అనే విషయాలు మనకు పెద్దగా తెలియవనే చెప్పాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని అందరికి ఉపయోగపడేలా అంటే ఆయా లగ్నాలవారికి, ఆయారాశులు చంద్రదాశులవారికి, సౌరమానం ప్రకారం ఫలితాలు సరిపోయేలా ఈ రచనను ప్రణాళిక చేయబడి ఈ నాటికి మీ చేతులలోకి వచ్చింది.

రాశీ చక్రంలో ఆరవరాశిగా చెప్పుకొనేది కన్యరాశి. సింహరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 150 – 180 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. ఉత్తర 2 3 4, హస్త 4, చిత్ర 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం సెప్టెంబర్ 17 – అక్టోబర్ 17 మధ్యలో పుట్టిన వారిని కన్యరాశి జాతకులుగా చెప్పబడ్డారు.

మీరు కన్య లగ్నం, కన్యరాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు
1.సృజనాత్మకత కలిగినవారైతే
2. నమ్రత వినయం కలిగినవారైతే
3. సిగ్గరి అయితే
4. విశ్లేషణ మరియు సంపూర్ణ వివరాలతో ఆలోచన కలిగినవారైతే
5. స్థిరమైన పనులు చేసేవారైతే
6. సరియైన నిర్ణయం తీసుకోగలిగినవారైతే
7. ఆదరణ, ప్రేమ చూపించే వారైతే
8. అతిగా విమర్శించేవారైతే
9. ఆడంబరాలు ఇష్టంలేనివారైతే
10. అనసరమైతే కఠినంగా ఉండేవారైతే ...
మీరు తప్పకుండా కన్యారాశివారే ... ఇక పుస్తకం చదవండి....

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Kanya Lagnam