-
-
కనిపించని సూర్యుడు
Kanipinchani Suryudu
Author: Manjari
Publisher: Sagar Publications
Pages: 63Language: Telugu
సాండర్స్ బంగ్లాకి తిరిగొచ్చేసరికి రాత్రయింది. వంటమనిషి తయారు చేసిన గోధుమ రొట్టెలు ఆరగించి, ఓ కప్పు టీతో డిన్నర్ ముగించాడు. తన పడక గది చేరుకుని సర్కిల్ కార్యాలయం నుంచి వచ్చిన రికార్డులు చూడడడం మొదలుపెట్టాడు. అవన్నీ పరిశీలించేసరికి అర్ధరాత్రి అయ్యింది. బయటనుండి సెంట్రీ బూట్ల చప్పుడు వినిపిస్తోంది.
దోపిడీ జరిగిన ప్రదేశాలన్నీ ఒక కాగితం మీద రాసుకున్నాడు. ప్రతి దోపిడీలో పదిమంది దృఢకాయులు పాల్గొంటున్నారు. ప్రయాణికుల్ని భయభ్రాంతుల్ని చెయ్యడానికి నాటు తుపాకులు, కత్తులు వాడుతున్నారు. డబ్బు, బంగారంతో పాటు గుర్రాలు కూడా దొంగిలించుకుపోతున్నారభయపెట్టి పని పూర్తిచెయ్యడం తప్ప ఇంతవరకూ ఎవర్నీ గాయపరచలేదనిర్మానుష్యమైన మల్కనగిరి మార్గంలో దోపిడీలు జరిగాయి. ఇప్పుడు ఆ మార్గంలో పగలు కూడా రాకపోకలు నిలిచిపోయాయి.
సాండర్స్ని ఆలోచనలు చుట్టుముట్టాయి.
ఆ వివరాల ప్రకారం దొంగల స్థావరం కొండల్లో ఉండి ఉండాలి. ఎలాగైనా ఆ ముఠాని పట్టుకుని దోపిడీలు నివారించాలి. ఆ రహదారి తిరిగి ప్రయాణానికి అనుకూలం చెయ్యాలి.
ఎలా?
అది తన సామర్ధ్యానికి పరీక్షగా తలచాడు సాండర్స్.

- ₹108
- ₹140.4
- ₹108
- ₹86.4
- ₹129.6
- ₹108