-
-
కనిపించని చెయ్యి
Kanipinchani Cheyyi
Author: hecharke
Publisher: Chinuku Publications
Pages: 164Language: Telugu
హెచ్చార్కేగారి ఈ కథలన్నీ జీవితంలోంచీ యధాలాపంగా కోసి పక్కకు పెట్టిన శకలాల్లాగే కనబడతాయి. అయితే జాగ్రత్తగా చదివినప్పుడు, వీటన్నింటికీ నిర్దుష్టమైన ప్రారంభాలూ, ముగింపులూ వున్నట్టు తెలుస్తుంది. కథలో చెప్పదలచుకున్న అంశానికీ, కథలో జరిగే ప్రతి సంఘటనకూ, తారసపడే ప్రతి వ్యక్తికీ మధ్య కచ్చితమైన లంకె వున్నట్టు అర్థమవుతుంది. యిటువంటి కథలనే పాశ్చాత్య విమర్శకులు 'slices of life" అంటూరు.
మౌలికంగా కవే అయినా హెచ్చార్కేగారి కథనంలో కవితాత్మకత కనబడదు. అయితే ప్రతి కథా దేనికది ప్రత్యేకమైన కవిత్వాత్మక శిల్పంతో కొనసాగుతుంది. అందువల్ల unity of effect అన్ని కథల్లోనూ సాధ్యమైంది.
యీ కథల్లోని పాత్రలు మనమే! యీ కథల్లోని జీవితమే మనది. అందువల్ల యీ కథల్ని చదువుతున్నప్పుడు మనల్ని మనం చదువుకుంటున్నట్టే వుంటుంది. యీ కథలు జీవన వైచిత్రిని రకరకాల పార్శ్యాలనుంచీ పరిచయం చేస్తాయి. భూత భవిష్యత్ వర్తమానాలు మూడింటినీ ముడివేసే fleeting movement ను చిత్రించిన కథలివి. యివి గతంలో జరిగిన మంచిచెడ్డల్ని విచారిస్తాయి. వర్తమానానికుండే ప్రాముఖ్యతను నిర్ధారిస్తాయి. భవిష్యత్తును గురించిన ఆలోచనల్ని రేకెత్తిస్తాయి.
- మధురాంతకం నరేంద్ర

- ₹108
- ₹270
- ₹75.6
- ₹540
- ₹90
- ₹216