• Kandapadya Kadambamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కందపద్య కదంబము (free)

    Kandapadya Kadambamu - free

    Pages: 49
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డా. జి. సీతాదేవిగారు చదివింది అర్థశాస్త్రం. కళాశాలలో ఆచార్యులుగా విద్యార్థులకు అర్థశాస్త్రాన్ని బోధించారు. కాని చిత్రంగా తెలుగు పద్య కవిత్వం పట్ల ఆసక్తిని పెంచుకొని, ఛందస్సు నేర్చుకొని, పద్యరచనలో ప్రావీణ్యాన్ని గడించారు.

వీరి పద్యరచనాశైలి ప్రశంసనీయం. పాదపూరణ కోసం వ్యర్థపదాలు కనిపించవు. చక్కని ధార, సార్థక పదప్రయోగం, సులభగ్రాహ్యమైన భాష వీరి పద్యాలకు వన్నె చేకూరుస్తున్నవి.

ఈ పద్యాలు ఔత్సాహిక కవులకు మార్గదర్శకాలు. కవి వతంసులకు ఆమోదయోగ్యాలు. పద్య కవితాభిమానులకు మనోరంజకాలు.

డా. గుఱ్ఱం సీతాదేవి గారు మునుముందు చక్కని పద్యకృతులను వెలువరించి, తెలుగు సాహిత్యానికి ఇతోధిక సేవ చేసి ధన్యజీవులు కావాలని ఆశిస్తున్నాను.


ప్రీతిన్ ఛందము నేర్చియుఁ
జేతోమోదమున రచనఁ జేసియు పద్యాల్
ఖ్యాతి గడింపఁగ గుఱ్ఱం
సీతాదేవినిఁ బ్రశంస సేసెద నిపుడున్.

- కంది శంకరయ్య

Comment(s) ...

మీ ప్రయత్నము బాగా ఉంది. చాలా సంవత్సరాల కృషి ఫలితము. అభినందనలు. పెద్ది సాంబశివరావు, 9441065414 గుంటూరు