• Kanda Makarandam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కంద మకరందం (free)

    Kanda Makarandam - free

    Pages: 50
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కందము ఛందమందు శతకంబును వ్రాసి మహాకవీంద్ర సద్బృందములోన జేరితివి ప్రేమపురాశివి తమ్ముడా! పఠింపందగు శైలి, భావనలు భవ్యము, భాష సుబోధకంబు, హృన్విందగు యోచనా సరళి నిన్ను నొనర్చెను ధన్యమూర్తిగా!

- దోరవేటి

'అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి:' అని ఆనందవర్ధనుడు, 'ఇంద్రపదవి కన్న కవీంద్రపదవి మిన్న' అని ఎల్లోరా కవి గొప్పతనాన్ని తెలియజేశారు. ఆ కవి
మొదటి మనిషి, సమాజంలో అతడు ఒక భాగం. ఆ తర్వాతే కవితాస్పందన కలిగిన విశిష్టవ్యక్తి. కవి మనిషిగా సమాజంలో ఒకడు కాబట్టి సమాజంలో కనిపించే అన్యాయాలకు, అసమానతలకు, అక్రమాలకు, దౌర్జన్యాలకు స్పందిస్తాడు. ఆ స్పందనలను ప్రకటించే రచనాశక్తిని సాధించడం వల్ల వాటిని లోకానికి నివేదించి ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా అలాంటి ప్రయత్నమే మిత్రుడు సాగర్ల సత్తయ్య చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి ప్రతిరూపమే ఈ కంద పద్యాల శతకం.

- డా. తండు కృష్ణ కౌండిన్య