-
-
కమనీయం
Kamaneeyam
Author: Dr. M.V.Ramana Rao
Publisher: Andhra Pradesh Sahitya Samskrutika Samakhya
Pages: 128Language: Telugu
పూజ్య సాహితీ మిత్రులు డా. ఎమ్. వి. రమణారావు గారు ప్రవృత్తి పరంగా రససిద్ధులై సాగించిన కవితా వ్యవసాయంలో 'రమణీయాన్ని' దర్శించి, ఆనందించిన పాఠక లోకానికి 'కమనీయం' అనే సమగ్ర కవితా కదంబాన్ని అందిస్తున్నారు. తరతరాల తెలుగు పద్యరచనా సంప్రదాయం కనుమరుగవుతున్న ఈ రోజుల్లో తెలుగు పద్యాలు ఇలా ఉండాలన్నట్లు అందించిన వీరి పద్య కవితా ఖండికలు రచయిత సొంతం చేసుకున్న గీర్వానాంధ్ర భాషా వైదుష్యానికీ, అలంకారిక భావనా పరిణతికీ, రచనా మత్కృతికీ దృష్టాంతాలనడం సముచితం!
సంస్కృతాంధ్ర పరిజ్ఞానాన్ని అందరికీ అందించాలనే నాతి దీర్ఘములైన అనుశీలన వ్యాసాలు, అనువాదాలు, సామాజిక జీవిత సమస్యలకు సంబంధించిన వ్యాసాలు, రచనలు ఈ తరం సాహితీ జిజ్ఞాసువులకు ఉపయుక్తమైన రచనలెన్నో ఇందులో పొందుపరచడం విశేషం!
ఇక గేయాలు, స్వేచ్ఛాకవితలు కూడా రాగాలు తీస్తూ, బారలు సాచుతునే సాగాయి. ఇటువంటి విశిష్ట రచనలు పొందుపరచి, 'కమనీయం' అందిస్తూన్న రమణారావు గారు సర్వదా-సర్వధా అభినందనీయులు.
- భావశ్రీ
