-
-
కల్పతరువు శ్రీరామకృష్ణ
Kalpataruvu Sri Ramakrishna
Author: Swami Chetanananda
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 90Language: Telugu
కల్పతరువు లేదా కల్పవృక్షం. సముద్ర మథనంలో కల్పతరువు పుట్టింది, కల్పాంతం తరువాత తిరిగి ఆ వృక్షం సముద్రగర్భంలో కలిసిపోయింది. దేవరాజు ఇంద్రుని నివాస స్థానమైన స్వర్గంలో ఈ కల్పతరువు ఉంటుందని పురాణ వచనం. కోరిన కోరికలు తీర్చే ఈ కల్పతరువు కథ భాగవతంలోను, రఘువంశంలోను, హితోపదేశంలోను మరియు వివిధ వైష్ణవ శాస్త్రాలలోను ఉల్లేఖించబడింది. శివాష్టకం స్తోత్రంలో ‘ప్రణమామి శివం శివకల్పతరుమ్’ – ‘మంగళప్రదమైన కల్పతరు రూపంలో ఉన్న శివునికి నమస్కరిస్తున్నాను’ అని చెప్పబడింది.
‘కల్పతరు’ శబ్దాన్ని వినగానే మనస్సులో ఒక విధమైన కోరిక సంచరించడం మొదలు పెడుతుంది. కల్పతరువు దగ్గరకు వెళ్ళి మనోరథాలన్నీ నెరవేర్చుకోవాలన్న ఆశ చిగురిస్తుంది. అయితే కామనలకు అంతం అంటూ ఉంటుందా? అగ్నిలో నెయ్యి వేయటం ద్వారా అగ్నిని ఆర్పలేము కదా! అదే విధంగా కామనలు పూర్తిగా తీర్చుకోవడం నెయ్యితో అగ్నిని ఆర్పడంలాంటిదే. కామనలు భోగించడం ద్వారా కామనా నివృత్తి చేయలేం.
శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు: ‘ఈశ్వరుడు కల్పతరువు. ఎవరు దేన్ని కోరితే ఆయన దాన్ని ప్రసాదించగలడు’. శ్రీరామకృష్ణులు సంసారంలో మగ్నుడైన మనిషిని భగవంతుని వైపు ఆకర్షితుణ్ణి చేయడానికి మొట్టమొదట ఇలా అన్నారు, ‘ఈశ్వరుడు కల్పతరువు. అతడు సర్వశక్తిమంతుడు. సర్వకామనలు తీర్చగల కామనాపూర్ణుడు. అయితే కల్పతరువు దగ్గరకు వెళ్ళి ప్రార్థించకపోతే కోరికలు నెరవేరవు.’
మనస్సు పవిత్రం కానంతవరకు భగవంతుని దగ్గరకు వెళ్ళాలని అనిపించదు. పవిత్ర మనస్సు గలవాడికి ప్రాపంచిక విషయ వస్తువులపైకి మనస్సు ఎన్నడూ పోదు. శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు: "ఈశ్వర చింతన ఎంత ఎక్కువగా చేస్తే సంసారంలో ఉన్న సామాన్య భోగ విషయాలపట్ల ఆసక్తి అంతగా తగ్గిపోతుంది.” “ఈశ్వర దర్శనం సామాన్యమైన ఫలాలను ఇవ్వదు. ఈశ్వరుడు అమృత ఫలాలైన జ్ఞానం, ప్రేమ, వివేకం, వైరాగ్యాలను ప్రసాదిస్తాడు.” శ్రీరామకృష్ణులు స్వయంగా ఆయనే కల్పతరువుగా మారి భక్తుల హృదయాలలో ఆధ్యాత్మిక జాగృతి కలిగిస్తారు. జీవులను భగవదోన్ముఖులును చేయడమే శ్రీరామకృష్ణుల ఉద్దేశం. కారణం దాని ద్వారా మాత్రమే జీవులు పరమశాంతిని, శాశ్వత ఆనందాన్ని పొందగలుగుతారు.
అయితే శ్రీరామకృష్ణుల జీవితంలో 1886, జనవరి 1వ తేదీన జరిగిన కల్పతరువు సంఘటన వివిధ పుస్తకాలలో వివరించబడింది. ఆ సంఘటనను విశదీకరిస్తూ రామకృష్ణ సంఘ వరిష్ఠ సన్న్యాసులు రచించిన వివిధ వ్యాసాలను స్వామి చేతనానంద సంకలనపరిచి బెంగాలీలో ఒక పుస్తకరూపంలో ముద్రించారు. ఆ పుస్తకంలోని కొన్ని వ్యాసాలను తెలుగులోకి అనువదించి 'కల్పతరువు శ్రీరామకృష్ణ' అనే ఈ చిరుపుస్తకంగా రూపొందించి పాఠకుల ప్రయోజనార్థం అందిస్తున్నాం.
- ప్రకాశకులు

- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹540