-
-
కళ్ళు తెరిచిన సీత
Kallu Terichina Sita
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 352Language: Telugu
Description
ఇది, 'కథ' కాదు,
'నవల' కాదు,
'కవిత' కాదు,
'వ్యాసం' కాదు,
'వార్త' కాదు,
'ఆత్మకథ' కాదు.
ఇది, వాటిల్లో ఏ కోవలోకీ చేరదు.
మరి, ఇది ఏమిటి అవుతుందో నేను ఇప్పుడు చెప్పలేను.
దీనికి ఏం పేరు వస్తుందో తేలితే చివరికి తేలాలి.
ఇది, ఒక అమ్మాయి జీవితంలో కొంత భాగం.
పెళ్ళీ, పెటాకులూ అయిన భాగం.
ఇందులో, ఒక్క సంఘటన అయినా కల్పన లేదు.
పాలల్లో నీళ్ళు కలిపినట్టూ, పట్టు తేనెలో బెల్లం పాకం కలిపినట్టూ, ఈ నిజ
జీవితంలో కల్పనలూ, ఊహాగానాలూ, కట్టుకథలూ, కలపలేదు.
ఇవి నిజ జీవిత సంఘటనలు!
జరిగింది జరిగినట్టు రాతలో పెట్టడమే నేను చేశాను. రాతలో పెట్టడంలో నా పద్ధతి నాది.
ఇది, ఆ అమ్మాయికి తెలియకుండా రాసింది కాదు; ఆ అమ్మాయి చెప్పగా తెలుసుకుని, ఆమె ఇష్టంతో, ఆమె ఇచ్చిన కాయితాల ఆధారంగా రాసిందే.
ఇందులో, కొన్ని పేర్లు, నిజం పేర్లే. కొన్నిపేర్లు, మారు పేర్లు.
Preview download free pdf of this Telugu book is available at Kallu Terichina Sita
Login to add a comment
Subscribe to latest comments

Offers available on this Book