• Kaliki Kathalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 150
    300
    50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కలికి కథలు

    Kaliki Kathalu

    Author:

    Pages: 648
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సంకలనంలో మొత్తం 50 కథలున్నాయి. ఆవిడ పరిశీలించిన ప్రతి అంశాన్ని కథగా తీర్చిదిద్దారు. కథలో పాత్రలతో పాటు పాఠకులను కూడా నడిపించగల అద్వితీయమైన నేర్పు ఆమెకున్నది. కొన్ని కథలను స్పృశించి హేమగారి నిపుణతను చూద్దాం. 'వానా వానా వల్లప్ప' కథలో రైతుల జీవన పరిస్థితులను కళ్లముందుంచారు. వ్యవసాయం వృత్తిగా జీవిస్తున్న రైతుల కష్టాలను, కన్నీళ్లను మనసు కదిలించేలా రాశారు రచయిత్రి. పత్తి గునగునా పెరిగి పూతకు రావడం, విరగకాసిన పత్తి కాయలు మంచుముద్దల్లా కళ్లు మిరుమిట్లు కొలిపేలా ఉండటం చూసి రైతులు తాము కుబేరులమైనట్లు కలలు గనడం, పొలాల్లో పత్తిని రాసులు పోసి గోడౌన్లకు చేరుస్తామనగా జడివాన కురిసి పత్తి ఎందుకూ పనికిరాకుండా పోవడం, అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతు బతుకు అంధకారం కావడం ఇట్లా రైతుల జీవితాన్ని సినిమా రీలులా కళ్లముందు కదిలించారు రచయిత్రి. ఈ కథలో బంగారప్ప, అతని కొడుకు శీనప్ప - అష్టకష్టాలు పడి వ్యవసాయం కలిసి రాక చితికిపోయి ఏదో ఒక పని చేసుకుందామని రైలు స్టేషన్‌కి చేరాడు కుటుంబంతో. అప్పుడు కురిసింది వాన. హోరుమంటూ కురుస్తూనే ఉంది, అదును తప్పి వచ్చిన ఆ వానగా ముగించారు. ఈ కథను 1970లో హేమగారు రచించారు. ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. అదే కథను నేటి పరిస్థితుల కనుగుణంగా తిరిగి రాశారు. 2009లో మరల ప్రచురితమైంది. ఈ కథ చదివితే ఎవరికైనా మనస్సు ఆర్ద్రం కాక తప్పదు.

'గంగిగోవు' కథలో తాను పెంచుకున్న గోవు గంగ పట్ల సుభద్రమ్మ పెంచుకున్న అనుబంధం, మమకారం, చివరికి ఆ ఆవు ఆకలితో అలమించి చెత్త ప్లాస్టిక్‌ బ్యాగులు తిని చనిపోవడం అనేది కథ. కోడలికి ఆ ఆవు పట్ల ప్రేమ ఉండదు. పవిత్రమైన ఆవు అంటూ గంగకు చనిపోయాక పూజలు చేసి ఊరేగించడం చూసి సుభద్రమ్మ మనస్సు వికలమవుతుంది. 'బతికుండగా గుప్పెడు ఎండు గడ్డికీ, గుక్కెడు మంచినీళ్లకీ నోచుకోలేదు. గంగ ఆకలి బాధకు ప్రాణాలు వదిలింది. చచ్చిపోయాక చేసే ఈ సంబరాలతో ఇప్పుడు ఆ జీవికి ఏం సంబంధం? ఈ ఆడంబరాలన్నీ నా గంగకు ఏం మేలు చేస్తాయి?' అని కుమిలిపోతుందిసుభద్రమ్మ. మూగజీవులు, అందునా పవిత్రమైన ఆవు హిందువుల జీవితంలో మహత్తరమైనది. ఆ కథను హేమగారు తీర్చిదిద్దిన తీరు అమోఘం.

'శిథిలాలయంలో శివుడు' కథలో కొడుకు రెండు కిడ్నీలు దెబ్బతింటే తన కిడ్నీలు అమ్మి కొడుకును రక్షించుకున్న తల్లి నాగమణి. 'ప్రేమాతీతం' కథలో తండ్రి జగన్నాథం కూతురు అపర్ణ ప్రేమ వ్యవహారంలో ఎంతో ఓపికగా కూతురితో మాట్లాడటం వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆ సందర్భంలో సంయమనంతో నిలిచి మాట్లాడుతున్నట్లుంటుంది. 'కొన్ని సందర్భాల్లో తమ పిల్లలే తమ శత్రువులైనట్లు పిల్లల్ని నానామాటలు అంటారు. నానా హింసలూ పెడతారు. కానీ జగన్నాథం కూతుర్ను పల్లెత్తుమాట అనలేదు' ఓపికతో నచ్చచెప్తాడు.

ఈ విధంగా ‘కలికి కథలు’లో కథలన్నీ ప్రత్యేకమైనవే.

- డా. తెన్నేటి సుధాదేవి

Preview download free pdf of this Telugu book is available at Kaliki Kathalu