• Kalidasu Ramakatha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కాళిదాసు రామకథ

    Kalidasu Ramakatha

    Pages: 117
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పరాశర పుత్రుడు వ్యాస మహర్షి కురువంశ చరిత్రను జయేతిహాసంగా పద్ధెనిమిది పర్వాలు రచించాడు. దానికే మహాభారతమనే ప్రఖ్యాతి. కురువంశానికి ముందు ఆర్యావర్తాన్ని పాలించిన రాజవంశాలలో రఘువంశం ప్రసిద్ధమైంది. ఈ రాజవంశం ద్వాపర యుగానికి పూర్వం త్రేతాయుగంలో పాలించినట్లు విశ్వసించ బడుతోంది. ఆ మహత్తర వంశగాథనే మహాకవి కాళిదాసు పద్ధెనిమిది సర్గలలో రచించి, చివరలో ముగింపుగా పంతొమ్మిదో సర్గ రచించాడు.

కవి కులపతి కాళిదాసు రామకథ చెప్పడంలో ఎంతో స్వతంత్రించాడు. ఎన్నో మార్పులు చేశాడు. సంగ్రహంగానూ, హృద్యంగానూ కథనం చేశాడు. దానిని చదువుతున్నప్పుడు లలితమైన తెలుగులో రామకథ చెప్పాలనిపించింది. పూర్తి చేశాను. రామకథతో పాటు, రఘువంశాన్ని సమాప్తి చేయడంలో కవి కులపతి కథనం చేసిన అగ్నివర్ణుని కథ కూడ ఈ ముద్రణలో చేరుస్తున్నాను.

మహత్తరమైన కురువంశం కూడ ధృతరాష్ట్ర పుత్రుల దౌష్ట్య పరంపరల వల్ల, అటు పాండు పుత్రులతో సహా నశించిపోవలసి వచ్చింది. భారతదేశాన్ని పరిపాలించిన కురు, రఘువంశాలు కూడ విషాదాంతంగా మిగిలిపోవలసివచ్చింది. ఎంత గొప్ప వంశంలో పుట్టినవాడైనా, తాతముత్తాలనాటి సౌజన్యాలు పుణికిపుచ్చుకోకపోతే అటు కురువంశము ఇటూ రఘవంశమూ నశించిపోయినట్లే విషాదాంతము తప్పదని, భారతీయ మహాకవులు జయేతిహాసంతోనూ, రఘువంశంలోనూ కూడ చెప్పారు.

- గ్రంథకర్త

Preview download free pdf of this Telugu book is available at Kalidasu Ramakatha