-
-
కాళిదాసు రఘువంశం
Kalidasu Raghuvamsam
Author: Rentala Gopalakrishna
Publisher: Jayanthi Publications Vijayawada
Pages: 200Language: Telugu
కాళిదాసు రఘువంశం
వచన రచన: రెంటాల గోపాలకృష్ణ
కాళిదాసు కావ్యాలలో రఘువంశం అనేక విధాల గొప్పది. ఆ మహాకవి కవితా మాధుర్యానికీ, ప్రతిభావ్యుత్పత్తులకూ, నికషోపలం ఈ కావ్యం! కనుకనే సంస్కృత విద్యార్థులు మొట్టమొదట రఘువంశ కావ్యాన్ని విధిగా అధ్యయనం చేస్తారు. వారి వారి యోగ్యతనూ, అర్హతనూ బట్టి, విజ్ఞుల, అల్పజ్ఞుల హృదయాలను కూడా అలరిస్తుంది ఈ హృద్యమైన కావ్యం
సకల కావ్యరత్నమని చెప్పదగిన రఘువంశానికి పలువురు వ్యాఖ్యలు రచించారు. వీటిలో మల్లినాథసూరి, హేమాద్రి, చారిత్రవర్ధన, దక్షిణావర్త, సమితి విజయ, వల్లభ, ధర్మమేరు, విజయగణి, విజయానందసూరి చరణ సేవక, దినకర మిశ్ర ప్రభృతుల వ్యాఖ్యలు ప్రధానమైనవి.
రమణీయమగు రఘువంశ కావ్యాన్ని సాధ్యమైనంత సరళ శైలిలో వచనంగా వ్రాసాను. నిజానికిది సాహసమే! మూలంలోని సొగసు పోనివ్వకుండా, పట్టుక రావాలని ప్రయత్నించాను. ఎంతవరకు కృతకృత్యుడయ్యానో పాఠకులకే ఎరుక.
ఇందలి అందచందాలన్నీ మహాకవి కాళిదాసువి, వికృతాలు ఏవి ఉన్నా, అవి నావి
- రెంటాల గోపాలకృష్ణ
Excellent book. Really enjoyed reading it.
Very nice book, very interesting to know about, what happened after 'Rama avatar'?