-
-
కలయో.. గోదావరి మాయో...
Kalayo Godavari Mayo
Author: Bhaskaruni Satya Jagadesh
Publisher: Self Published on Kinige
Pages: 142Language: Telugu
గోదావరి నది మీద డామ్ నిర్మించి, నిస్సారమైన బీడు భూములకు నీరందించి, సస్యశ్యామలం చేయాలన్నది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రావు గారి ప్రధానాశయం. అందుకోసం శాయశక్తులా ప్రయత్నించి తన ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించేలా చేశాడు. కానీ దాన్ని కార్యరూపంలోకి పెట్టడానికి నదిలోకి సర్వే కోసం వెళ్ళిన అధికారులంతా సుడిగుండంలో చిక్కుకొని ప్రాణాలొదులుతున్నారు. నదిపై డామ్ నిర్మాణం గోదావరి తల్లికి ఇష్టం లేదనీ, అందుకే ఆ ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ పొట్టన పెట్టుకుంటోందని ప్రజల్లో ఓ నమ్మకం, భయం ఏర్పడ్డాయి. అంతే! ఆ ప్రతిపాదన మూలపడింది.
రావుగారి ఆశయం నెరవేర్చడానికి ఎవరైనా ముందుకొచ్చారా? వచ్చిన వాళ్ళకు ఎదురైన సమస్యలేంటి? సమస్యలను అధిగమించి ముందుకెళ్ళారా? లేదా?
తెలుసుకోవాలంటే చదవడం మొదలుపెట్టండి. ఓ అమెరికా అమ్మాయి ఆంధ్రా ఆగనమంలోని అంతరార్థమేమిటో తెలుసుకునేందుకు చదవండి - "కలయో... గోదావరి మాయో..." నవల.
* * *
పుష్కర యాత్రికుల కోసం ప్రత్యేక అనుబంధం నవల చివరలో...

- ₹108
- ₹72
- ₹72
- ₹108
- ₹60
- ₹108