• Kalaratri
  • fb
  • Share on Google+
  • Pin it!
 • కాళరాత్రి

  Kalaratri

  Pages: 128
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

వీజల్ బోస్టన్ యూనివర్సిటీలో హ్యుమానిటీస్ ప్రొఫెసర్, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత (1986). 40కిపైగా పేరుగాంచిన రచనలు చేశారు. నైట్ (కాళరాత్రి - అనువాదం) ఆయన మొదటి రచన. అతిశక్తివంతమైన చిన్న పుస్తకం.
జర్మనీలో నాజీలు పరిపాలనకు రాగానే వారు నిర్మించిన సమాజంలో యూదులకు చోటు లేదని నిర్ణయించారు. లక్షలమంది యూదులను తుపాకులకు బలి చేశారు. వారిని చంపటమే కాక వారికి సరైన అంత్యక్రియలు కూడా జరగనీయలేదు.
రెండవ ప్రపంచయుద్ధంలో నాజీపాలకులు హిట్లర్ నాయకత్వాన యూదు పిల్లలను పెద్దవారిని ఆడమగ తేడాలేకుండా అంతమొందించడమే కాక వారి మతాన్ని, వారి నాగరికతను, వారి ఆచారాలను, వారి సాహిత్యాన్ని సమూలంగా తుడిచిపెట్టసాగారు.
ఎలీ వీజల్, అతని కుటుంబాన్ని సిఫెుట్ టౌన్ నుండి తీసుకువెళ్ళినప్పడు అతని వయస్సు 15 సంవత్సరాలు. యూదులందరిని అరెస్టు చేసి క్యాంపులకు పశువులను చేరవేసే రైలు బోగీలలో కుక్కి చేరవేశారు. వారిలో చనిపోయినవారిని ఈడ్చిపారవేశారు. పిల్లలను, ఆడవారిని, వృద్దులను కొలిమి మంటలలో విసిరి బూడిద చేశారు. ఎలీ తల్లి, చిన్న చెల్లి మొదటినాడే అగ్నికి ఆహుతయ్యారు. తండ్రి నరకయాతనలు వీజల్ వెంటవుండి కళ్ళారా చూసి సహించవలసి వచ్చింది. ఆయనను కూడా చివరలో ప్రాణం వుండగానే ఈడ్చిపారవేశారు. ఇంత సూపు, రొట్టెముక్క ఇచ్చి యూదులతో రకరకాల చాకిరీ చేయించారు. వీజల్ బతికి బయటపడటం ఒక అద్భుతం అన్నారు అందరూ, కానీ వీజల్ అలా భావించలేదు. ఛాన్స్ అన్నాడు. మిరకిల్ అనలేదు. లక్షలమంది యూదులు చంపబడ్డారు. ఆ పీరియడ్ ప్రపంచ చరిత్రలో ఒక మాయని మచ్చ.
వీజల్ క్యాంపులో బతకడానికి ప్రయత్నించలేదు. బతకాలనే ఆశ వదులుకున్నాడు. అయినా బతికి ఆష్‌విట్స్ క్యాంపు జీవితాన్ని అక్కడి క్రూరత్వాన్ని (నాజీలు యూదులను రెండో ప్రపంచయుద్ధ కాలంలో చంపటం) హాలో కాష్ట్ అన్నారు. దానిని గురించి వివరంగా వీజల్ నైట్ అనే పేరుతో రచించాడు. అక్కడ అమానవీయత కేవలం మానవతగా చెలామణి అయ్యిందన్నాడు. ఒక మనిషిలోని క్రూరత్వమంతా బట్టబయలయిన ప్రదేశం అది.
వీజల్ మొదట తన మాతృభాష యిద్దిష్‌లో ‘ప్రపంచం నిశ్శబ్దంగా వుండిపోయింది’ అనే పేరుతో రాశాడు. తరువాత ఫ్రెంచ్ ఇంగ్లీషులోకి అనువాదాలు వచ్చాయి. నేను చదివిన అనువాదం వీజల్ భార్య మారియల్ చేసినది. యువతకు భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డలకు యూదుల దహనకాండ గురించి తెలపాలని ఇది రాశానన్నాడు. భవిష్యత్తులో ఇలాంటి ఘోర కలి పునరుక్తి కాకూడదని ఇలా రాశానన్నాడు. నోబెల్ ప్రైజు గ్రహించేటప్పుడు ఆయన చేసిన ప్రసంగంలో - ప్రపంచంలో ఎక్కడైనా ఏ జాతి అయినా హింసకు, ఆకలికి, అవమానాలకు, మతం పేరిటనో, అభిప్రాయ భేదాల పేరిటనో గురయితే మిగతా మానవులు వారి పక్షాన నిలబడటమే బాధ్యత అన్నాడు. తాను జీవించి వున్నందుకు ఈ పుస్తక రచన సార్ధకతనిచ్చిందన్నాడు.

- వెనిగళ్ళ కోమల

Preview download free pdf of this Telugu book is available at Kalaratri