• Kalapurnodayamlo Srungarabhava Vaividhyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 120
    180
    33.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కళాపూర్ణోదయంలో శృంగారభావ వైవిధ్యం

    Kalapurnodayamlo Srungarabhava Vaividhyam

    Pages: 83
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కళాపూర్ణోదయం శృంగారరసప్రధానమైన మహాప్రబంధం. అదొక అద్భుతమైన కావ్యం అనటంలో సందేహం లేదు. అది పండితులుగూడా అంగీకరించిన విషయమే! జి.వి.కృష్ణరావు గారన్నట్లు ఇది ప్రపంచ సాహిత్యంలో స్థానం సంపాదించగల రచన.సామాన్య పాఠకునికి కొంత కఠినంగా తోచటం వలన ఇతర కావ్యాలకున్న ప్రాచుర్యం ఈ కావ్యానికి కలిగి ఉండకపోవచ్చు. కాని పరిశీలనా దృష్టితో పఠించినప్పుడు దాని వలన కలిగే రసానుభూతి అనితరసాధ్యం. స్త్రీమూర్తి కళాత్మకం అనటానికి ఈ రచన నిదర్శనం. బ్రహ్మను సైతం భ్రమింపజెయ్యగల కళారూపం స్త్రీ నిర్మాణంలో ఉన్నది. ఆ రూపాన్ని ఆధారం చేసుకుని సృష్టించిన పాత్రలు, ఆ ప్రేరణతో కలిగిన భావాల ఆధారంగా చిత్రించిన పాత్రల స్వభావాలు వాటిని మలిచి కథారూపం ఇవ్వటంలో సూరన చూపిన ప్రతిభ అద్భుతమనే అనాలి. దానికి తోడు అతని కథాకథనచాతురి చదువరిని కొంత తికమక పెట్టినా కొంచెం ఓర్పు చూపి ఆసాంతం చదివితే రసభరితమని తెలుస్తుంది. భౌతికశాస్త్రంలో సాపేక్షసిద్ధాంతం లాగా సాహిత్యంలో కళాపూర్ణోదయం కూడా ఊహాతీతమై, ఊహామాత్రంగానే భావనలో స్థిరపడగల సృష్టి అయింది.

పాఠకుని ఉత్సాహాన్ని కట్టి ఉంచటానికి చేసిన మెలికలు, కథానిర్మాణంలో చూపిన మెలకువలు గ్రహించటానికి కొంత ఆలోచన అవసరమే! అది రసానుభూతిని ఇనుమడింపజేస్తుంది. అలాకాక ఒక్కొక్క పాత్రను ఈ చిక్కులనుంచి విడదీసి ఆ పాత్రల స్వభావాలను, కథలో వాటి స్థానాలను వివరించటం వలన మొత్తం కావ్యాన్ని ఆస్వాదించటం కొంత తేలిక కావచ్చు. ఆ ఉద్దేశంతోనే ఈ రచన చెయ్యటం జరిగింది. కావ్యంలో లేని విషయాలేవీ ఇందులో లేవు. ఉండకూడదు గూడాను. కావ్యంలో ఉన్న వస్తువు ఆధారంగానే ఒక్కొక్క పాత్రను విడిగా వివరించే ప్రయత్నం జరిగింది. పాత్రలు స్వయం ప్రతిపత్తిగలవే ఐనా ఆ పాత్రల పరస్పర సంబంధం ఆధారంగా ఈ కావ్యం అవతరించింది. కళాత్మకమైన వాణిరూపంతో ప్రేరేపితుడైన బ్రహ్మ తనలో కలిగిన శృంగారభావాలను ఈ పాత్రల రూపంలో విశదీకరించాడు. అది నిజంగా బ్రహ్మవాక్కయి శాశ్వతత్వాన్ని సంపాదించుకున్నది. సాహిత్యం ద్వారా రసానుభూతి పొందాలనుకునే వారికి ఇది ఎంతోచేరువైన సాధనంగా భావించవచ్చు. ఒక్కొక్క పరిస్థితికి వేర్వేరు వ్యక్తులు రకరకాలుగా ప్రేరేపితులవుతారు. ఒకే దృశ్య సందర్శనలో వివిధ వ్యక్తులలో వివిధ భావాలు కలుగుతవి. శృంగారభావంలో గూడా ఆవిధమైన వైవిధ్యం ఉన్నది. ఆ విషయం కావ్యంలో ఎంతో నేర్పుతోను, ఓర్పుతోను చిత్రించబడింది. కథలోని మెలికలన్నీ ఒంపుసొంపులై కథకు సౌందర్యాన్ని కల్పించినవి. విచిత్రాలెన్ని ఉన్నా రసభంగం కాకుండా ఆస్వాదించదగినరీతిలో ప్రదర్శింపబడింది. ఆ విషయం స్పష్టం చెయ్యటం కోసమే ఈ ప్రయత్నం జరిగింది.

ఇది పండితుని ప్రయత్నం కాదు. అందువలన పండితులకిందులో లోపాలు కనపడవచ్చు. కాని సామాన్య పాఠకునికి కొంతగానైనా రసానుభూతి కలగటానికి సహాయపడితే సంతోషించదగిన విషయమేగదా! రసజ్ఞులు ఆ దృష్టితో ఆదరిస్తారని ఆశిస్తాను.

- జాస్తి జవహర్లాల్

Preview download free pdf of this Telugu book is available at Kalapurnodayamlo Srungarabhava Vaividhyam