-
-
కాలాన్ని జయించిన మహామనీషి గురజాడ వేంకట అప్పారావు
Kalanni Jayinchina Mahamaneeshi Gurajada Venkata Apparao
Author: Dr. Vedagiri Rambabu
Publisher: Sri Vedagiri Communications
Pages: 20Language: Telugu
తెలుగు ఆధునిక యుగకర్త గురజాడ వేంకట అప్పారావుగారు మనల్ని విడిచి వెళ్ళిపోయి వందేళ్ళయింది. ఇది బాధాకరమైన విషయమైనా, శతాబ్ది సంస్మరణ సంవత్సరం చేసుకోవడం వెనుక ఓ స్ఫూర్తి ఉంది.
వందేళ్ళయినా ఆయన తెలుగువాళ్ళ మనస్సులో అలాగే ఉన్నారు. ఇక ముందు ఉంటారు కూడా! అక్షరంతో సామాజిక రుగ్మతల్ని రూపుమాపవచ్చని మనకి చెప్పారు. సంకల్పబలముంటే అనారోగ్యాలు అడ్డురావని నిరూపించారు. అందుకే అప్పారావుగారి అనారోగ్యానికి సంబంధించిన విషయాలకే పెద్దపీట వేయడం జరిగింది. ఎన్ని అనారోగ్యాలతో ఎంత తీవ్రంగా బాధపడుతూనే ఒంటి చేతితో భాషా సాహిత్యాలని ఆధునికతవైపు మళ్ళించి 'ఆధునిక యుగకర్త' అయ్యారు.
తెలుగు సాహిత్యంలో మకుటాయమానంగా వెలుగొందే కన్యాశుల్కం నాటకం ముత్యాలసరాలు, ఆధునిక కథలతో మనకి సాహిత్యంలో కొత్తదారిని చూపించారు.
అటువంటి మహనీయుణ్ణి మరోసారి స్మరించుకునే అవకాశం. అప్పారావుగార్ని అన్ని కోణాలలో చూద్దాం. అందరం స్ఫూర్తి పొందుదాం. ఈ విశేషాల్ని ముందుతరాల వాళ్ళకందించి, వాళ్ళూ ఈ స్ఫూర్తిని పొందేలా చూద్దాం. ఇక ముందు పుటల్లోకి వెళ్ళండి.
- వేదగిరి రాంబాబు
