-
-
కాలంలో ప్రయాణం
Kalamlo Prayanam
Author: Manne Satyanarayana
Language: Telugu
రాష్ట్రస్థాయి నవలల పోటీలో రూ.20,000/- బహుమతిని పొంది, ఆంధ్రభూమి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడిన నవల ఇది.
* * *
"నా పేరు వాసిరెడ్డి రఘురామయ్య"
"నా పేరు కూడా అదే!"
"నేను మీ ముని ముని మనవడ్ని. మీకు పది తరాల తర్వాత పుట్టినవాడ్ని"
"అయితే, ఇప్పటికి నీవు పుట్టనే లేదు. మరి మా తరంలో కెలా వచ్చావు?"
"కాలంలో ప్రయాణం చేసి, భవిష్యత్తు నుంచి మీ తరంలోకి వచ్చాను!"
* * *
ఇటువంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో---
టైమ్ మెషిన్లో ప్రయాణం చేసి క్రీ శ. 1521వ సంవత్సరంలోకి వెళ్ళి, అప్పటి విజయనగర సామ్రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులను కలిసి, ఆనాటి రాజకీయ సామాజిక పరిస్థితులను పరిశీలించి, తిరిగి ఇప్పటి కాలంలోకి వస్తాడు---
అలాగే, 11వ శతాబ్దంలోని రాజమహేంద్రవరానికి వెళ్ళి నన్నయభట్టు గారిని, వారి మిత్రుడు, గొప్పకవి అయిన వాణసనారాయణ భట్టు గారినీ చాళుక్య రాజు రాజరాజనరేంద్రుని కలిసి, అప్పటి కొన్ని సంఘటనల వివరాల నడిగి తెలుసుకుని, తిరిగి ఇప్పటి కాలానికి వస్తాడు ---
ఇలాగే-అద్భుతమైన సంఘటనలతో, సన్నివేశాలతో ఈ "కాలంలో ప్రయాణం" సాగుతుంది!
ఈ నవల చదువుతుంటే, మీరు కూడా కాలంలో ప్రయాణం చేస్తున్న అనుభూతిని పొందుతారు.
Good imagination to go back to the times of Srkrishna Devaraya and Nannayya times and explain the social and economic conditions of those period